అన్వేషించండి

Prathyusha Death Case: అవే ఆమె ఆఖరి మాటలు, నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి - నటి ప్రత్యుష తల్లి సంచలన వ్యాఖ్యలు

నటి ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం సంచలనం 2002 లో సంచలనం సృష్టించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ప్రత్యూష ఆత్మహత్య గురించి ఆమె తల్లి సరోజింజ్ దేవి సంచలన విషయాలు వెల్లడించింది.

నటి ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002 లో జరిగిన ఆ  సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ప్రత్యుషా సడెన్ గా ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ప్రత్యూష తల్లి సరోజిని దేవి చాలా కాలం న్యాయం కోసం పోరాడారు. ఆ విషాద ఘటన జరిగి దాదాపు 20 ఏళ్ళు గడుస్తోంది. దీనిపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఐటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టారు. చనిపోయే ముందు రోజు ప్రత్యూష తాను ప్రేమించిన అబ్బాయి సిద్దార్థ్ రెడ్డి తో బయటకు వెళ్లిందని, ఆ సమయంలో జయం సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఓకే చేసారని, జయం ఆఫీస్ కు వెళ్లి వస్తానని చెప్పిందని అయితే అదే ఆమె చివరి మాటలు అవుతాయని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

తన కూతురు చనిపోయిన మూడు రోజుల తర్వాత తాను తన కూతురు చనిపోయిన ఆసుపత్రికి వెళ్లి అక్కడ పని చేసేవాళ్ళతో మాట్లాడితే అసలు విషయం తెలిసిందని చెప్పారు. ఆరోజు ఒక కారు వేగంగా ఆసుపత్రికి వచ్చిందని, అందులో నుంచి ఒక అమ్మాయిని వీల్ చైర్ లోకి తీసుకెళ్లారని, అప్పటికే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి ఉందని వీల్ చైర్ లో ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారని తెలిపారు. ‘‘నిజంగా అమ్మాయితో పాటు అబ్బాయి కూడా విషం తాగితే సిద్దార్థ్ రెడ్డి ఆసుపత్రి వరకూ ఎలా వచ్చారు? ఎలా ఫస్ట్ ఫ్లోర్ వరకూ వెళ్ళాడు?’’ అని  అనే ప్రశ్నించారు. అనుమానం రాకూడదు అనే సిద్దార్థ్ కూడా ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు అందరిని నమ్మించారని అన్నారు. ప్రత్యూష కు సంబంధించిన బట్టలు కూడా ఇవ్వలేదని సరోజిని దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే ప్రత్యూష చికిత్స సమయంలో మోషన్ చేయడం వలన వాటిని వర్కర్స్ అన్నింటితోపాటు పడేసుంటారని ఆసుపత్రి వాళ్ళు సింపుల్ గా చెప్పేశారని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రి వైద్యులే ఆధారాలను మాయం చేసారని ఆరోపించారు. 

కేసును కావాలనే పక్కదారి పట్టించారని అన్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే భయానక విషయాలు బయటకు వచ్చాయని సరోజిని దేవి చెప్పింది. కొంతమంది కలిసి తన కుమార్తెను నాలుగైదు గెస్ట్ హౌస్ లకు మార్చి నరకయాతన చూపించారని వాపోయింది. తన కుమార్తెను ఘోరంగా హింసించారని, అందుకే తన కుమార్తె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతోన్న తనకు బెదిరింపు కాల్స్ కూడా  వచ్చాయని ఆమె అన్నారు. ఎంత తిరిగినా న్యాయం జరగదని బెదిరించే వారని తెలిపారు. అయినా తాను భయపడలేదని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయానని చెప్పారు సరోజిని. 20 ఏళ్ళ తర్వాత కూడా తన కుమార్తెను తలుచుకొని రోజూ బాధపడుతున్నానని అన్నారు. తమ కుమార్తెను హింసించిన వారికి కచ్చితంగా ఆ దేవుడే శిక్ష విధిస్తాడని తెలిపారు. 

Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది

టాప్ హెడ్ లైన్స్

Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
Gundeninda Gudigantalu Nov12:రోహిణిని షోరూమ్‌కు తీసుకెళ్తానన్న మనోజ్‌..తల్లీకొడుకుల బంధం తెంపుకుని వెళ్లమన్న ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: రోహిణిని షోరూమ్‌కు తీసుకెళ్తానన్న మనోజ్‌..తల్లీకొడుకుల బంధం తెంపుకుని వెళ్లమన్న ప్రభావతి
Podarillu Serial Today NoV 12: కేశవ్‌ చేతికి వచ్చిన బైక్‌ సర్వీసింగ్ సెంటర్‌ స్థలం పత్రాలు...కొత్త దుకాణంలో లక్ష్మీ పూజ
పొదరిల్లు: కేశవ్‌ చేతికి వచ్చిన బైక్‌ సర్వీసింగ్ సెంటర్‌ స్థలం పత్రాలు...కొత్త దుకాణంలో లక్ష్మీ పూజ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Embed widget