అన్వేషించండి

Nithya Menen: చాలా బాధగా అనిపించింది- ప్రభాస్‌పై చేసిన కామెంట్స్‌కు నిత్యామీనన్ వివరణ

నిత్యామీనన్ అప్పట్లో ప్రభాస్ గురించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బొద్దుగా ముద్దుగా కనిపించే నిత్యా మీనన్ అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా, ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించి తన నటనతో మెప్పించింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తనలో మంచి నటి మాత్రమే కాదు గాయని కూడా ఉంది. నిత్యా మీనన్ మీడియాకి, ఇంటర్వ్యూకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే ఆమె ఇంటర్వ్యూలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో అలా మొదలైంది సినిమా ప్రచార సమయంలో ప్రభాస్ ఎవరో తనకి తెలియదు అనేసి చిక్కుల్లో పడింది. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడేసుకున్నారు తనని.

ఇప్పుడు మళ్ళీ ఇదే విషయం సోషల్ మీడియాలో మరోసారి బయటకి వచ్చేసింది. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్యూలో నిత్యా మాట్లాడుతూ తన మాటలు తప్పుగా అర్థం చేసుకుని రాసేశారని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో తనకి అంతగా తెలుగు రాదని, తెలుగు హీరోల గురించి కూడా తెలియదని ఆమె అన్నారు. “కేరళలో ఎక్కువగా చిరంజీవి, నాగార్జున పేర్లు వినిపించేవి. వెంకటేశ్, అల్లు అర్జున్ కొద్దిగా తెలుసు. అప్పుడు మీడియా వాళ్ళు ప్రభాస్ గురించి అడిగారు. అది సరిగా వినిపించక ఎవరు? అని అడిగాను. ఇక అంతే నా గురించి నెగటివ్ గా రాసేశారు. అది చాలా బాధగా అనిపించింది” అని చెప్పుకొచ్చింది. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అలా వార్తా క్రియేట్ చేసి రాసేశారని అన్నారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ గురించి తాను మాట్లాడిన విషయం బయటకి రావడంతో మళ్ళీ చిక్కుల్లో పడినట్లయ్యింది నిత్యామీనన్ పరిస్థితి.

Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?

సినిమాల విషయానికొస్తే..

తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్  'భీమ్లానాయక్'(BheemlaNayak) సినిమాలో కనిపించింది. అలానే 'ఇండియన్ ఐడల్ తెలుగు' షోకి జడ్జిగా వ్యవహరించింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. రీసెంట్ గా 'తిరు' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఓ మలయాళ హీరోని ఆమె పెళ్లాడబోతున్నట్లు కథనాలు ప్రసారం కాగా.. నిత్యామీనన్ నేరుగా స్పందించింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. 

నిత్యామీనన్ నటించిన 'వండర్ వుమెన్' సినిమా ఇటీవలే విడుదలైంది. అంజలి మీనన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నదియా, నిత్యా మీనన్‌తో పాటు ప్రముఖ మలయాళ కథానాయిక పార్వతి తిరువొతు, పద్మప్రియ తదితరులు నటించారు. సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమా విడుదల అయ్యింది. అమ్మ కాబోయే మహిళలు పడే ఆరాటం, వాళ్ళ ఫిలింగ్స్ గురించి ఇందులో చక్కగా చూపించారు.

Also read: ప్రెగ్నెంట్ వార్తలపై ఎమోజీలతో స్పందించిన ఆది పిన్నిశెట్టి భార్య నిక్కీ గల్రానీ

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget