అన్వేషించండి

Mrunal Thakur: నా తొడలు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, మృణాల్ అంత మాట అనేసింది ఏంటి?

Mrunal Thakur: ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనమృణాల్‌ ఠాకూర్‌, ప్రస్తుతం వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. తాజాగా ఆమె తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Mrunal About Her Body Shape: మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సౌత్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా అందరినీ కట్టిపడేస్తుంది. చీరలో సంప్రదాయబద్దంగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. రీసెంట్ ఫిలింఫేర్ అవార్డ్స్‌ వేడుకలో స్టైల్ ఐకాన్‌గా మారిపోయింది. ఆకర్షణీయమైన సీ త్రూ గౌను ధరించి అందరినీ కనువిందు చేసింది.   

మన శరీరం ఎలా ఉన్నా ఇష్టపడాల్సిందే!

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన బాడీ గురించి వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. మన శరీరం ఎలా ఉండాలనేది మన చేతుల్లో లేదని చెప్పింది. మనం తీసుకునే జాగ్రత్తల కారణంగా కొంత మేర మార్చుకోగలమే తప్ప, పూర్తి స్థాయిలో సరి చేయలేమని చెప్పారు. “నేను వర్కౌట్స్ కోసం వెళ్లినప్పుడు జిమ్ ట్రైనర్లు నా పిరుదుల వైపు ఫోకస్ చేస్తారు. ఎలా ఉండాలో చెప్తారు. కానీ, ఇది మీ సమస్య కాదు, నా సమస్య అని చెప్తాను. నా శరీరం నా బలం. నేను ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరిస్తాను. నాకు సమస్య లేనప్పుడు మీకు ఎందుకు? అని అడుగుతాను” అని చెప్పింది.

మీ శరీరాన్ని మీరు ప్రేమించండి!

శరీర నిర్మాణం మన చేతుల్లో లేని విషయం అని మృణాల్ వెల్లడించింది. “మీ శరీరం గురించి మీరు ఏం చేయలేని కొన్ని విషయాలు ఉన్నాయి. సహజంగానే కొన్ని శరీర భాగాలు వైకల్యంతో రావచ్చు. అలాంటి మహిళల పట్ల వివక్షణ చూపించడం భారతీయులకు అలవాటుగా మారింది. ఎందుకు వారిని చిన్న చూపు చూస్తారో అర్థం కాదు. ఉన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన శరీరం ఎలా ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు. రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండేలా ఆహారం తీసుకుంటే చాలు. నా తొడలు లావుగా ఉంటాయి. అయినా, నాకు ఎలాంటి బాధ లేదు. మీరు కూడా మీ శరీరాన్ని ప్రేమించండి” అని చెప్పుకొచ్చింది.

ఆ రోజు చాలా సంతోషం కలిగింది!

గతంలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి ట్రోలింగ్ కు గురైనట్లు మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది.“వాస్తవానికి నేను గతంలో బరువు తగ్గడానికి ప్రయత్నించాను. నా ముఖం పీలగా మారిపోయింది. శరీరం పై భాగం, కింది భాగం సన్నగా మారింది. నన్ను చూసి చాలా మంది మట్కా(కుండ)లా ఉన్నావు అంటూ ఎగతాళి చేశారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఓసారి అమెరికాకు వెళ్లినప్పుడు చాలా మంది నన్ను ఇండియన్‌ కర్దాషియన్‌ అని పిలిచారు. నాలాంటి శరీర రూపం కోసం బోలెడు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది” అని మృణాల్ వెల్లడించింది. రీసెంట్ గా ‘హాయ్‌ నాన్న’ మూవీలో కనిపించిన మృణాల్‌ ఠాకూర్‌, ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నది.

Read Also: LSD ట్రైలర్ - ఆ ఓటీటీలోకి వచ్చేస్తున్న అడల్ట్ సీరిస్ - దిల్ రాజు డైలాగ్‌ను ఇలా వాడేశారు!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today NoV 17:ఊరిలో ఉన్న బైక్‌లన్నీ పాడు చేసి కేశవ్‌ షాపుకు వచ్చేలా చేస్తుంది శైలూ...అది తెలుసుకుని బుస్సుపై కస్సుబుస్సులాడతాడు కేశవ్
పొదరిల్లు: ఊరిలో ఉన్న బైక్‌లన్నీ పాడు చేసి కేశవ్‌ షాపుకు వచ్చేలా చేస్తుంది శైలూ...అది తెలుసుకుని బుస్సుపై కస్సుబుస్సులాడతాడు కేశవ్
Gundeninda Gudigantalu Nov17:అరుణ్‌ ఇంటికి వెళ్లి తనను మర్చిపొమ్మని చెప్పేసిన సుమతి..బాలుకు సర్దిచెప్పేందుకు మీనా,శివ ప్రయత్నం
గుండెనిండా గుడిగంటలు: అరుణ్‌ ఇంటికి వెళ్లి తనను మర్చిపొమ్మని చెప్పేసిన సుమతి..బాలుకు సర్దిచెప్పేందుకు మీనా,శివ ప్రయత్నం
Romantic Drama OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
Karthika Deepam 2 Serial Today November 17th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న 2 కోట్లకి ప్రేమను అమ్ముకుంది.. సూరజ్ మనసు విరిచేసిన మాలిని! కార్తీక్, దీప రివేంజ్ తీర్చుకుంటారా!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న 2 కోట్లకి ప్రేమను అమ్ముకుంది.. సూరజ్ మనసు విరిచేసిన మాలిని! కార్తీక్, దీప రివేంజ్ తీర్చుకుంటారా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget