Actress Hema: ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన నటి హేమ
సీనియర్ నటి హేమ ఫేక్ వార్తలపై మండిపడింది. అంతేకాదు అలాంటి వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రెటీలపై నిత్యం ఏదొక పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే నిజం అవుతూ ఉంటాయి. కానీ అలాంటి వార్తలను చాలా మంది సెలబ్రెటీలు లైట్ తీసుకుంటారు. ఇంకొంత మంది వాటిపై వివరణలు ఇచ్చుకంటూ వస్తారు. మరికొంత మంది మాత్రం అలాంటి ఫేక్ వార్తలపై సీరియస్ అవుతారు. వాటికి చట్టపరంగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. టాలీవుడ్ లో ఇలాంటి ఘటనలు గతంలోనూ చూశాం. అయితే తాజాగా సీనియర్ నటి హేమ ఫేక్ వార్తలపై మండిపడింది. అంతేకాదు అలాంటి వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది హేమ. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫొటోలను ఫేక్ తంబ్‌నెయిల్స్ తో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్ లు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపించింది. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇటీవల హేమ తన వివాహవార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ నేఫథ్యంలో తన భర్త సయ్యద్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను అసభ్యకర థంబ్ నెయిల్ ను పెట్టి అప్లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది హేమ. అలాంటి వారిని పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు వ్యూస్ కోసం సమాచారాన్ని క్రాస్ చెక్ కూడా చేయకుండా నిజంగా జరిగినట్టు నేరుగా రాసేయడంతో ఫేక్ వార్తలు పెరుగుతున్నాయి. దీంతో కొంతమంది వీటిపై సీరియస్ అవుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ సీనియర నటుడు కోటా శ్రీనివాస రావు గుండెపోటుతో హఠాత్తుగా మరణించినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ వార్త చాలా సేపు చక్కర్లు కొట్టింది. అటు ఇటు తిరిగి ఆ విషయం కోటా శ్రీనివాసరావుకు చేరడంతో ఆయన స్వయంగా ఓ వీడియోను విడుదల చేశారు. తాను క్షేమంగా ఉన్నానని, తాను చనిపోయినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేశారని అన్నారు. ఎవరో వచ్చి చెప్పేవరకూ ఈ విషయం తనకు తెలియలేదన్నారు. తాను చనిపోయానని వార్తలు రావడంతో ఇంటికి పోలీసులు కూడా వచ్చారని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని, ప్రజలు కూడా ఇలాంటి వారికి గట్టిగా వ్యతిరేకిస్తే వారికి బుద్ది వస్తుందని, ఫేక్ వార్తలను నమ్మొద్దని అన్నారు.
టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొద్ది మంది ఆర్టిస్టుల్లో హేమ కూడా ఒకరు. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం హిందీ సినిమాల్లో నటించింది హేమ. దాదాపు 500 సినిమాలకు పైగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది హేమ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉంటుంది హేమ.
Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా