అన్వేషించండి

Anasuya Bharadwaj: మరీ అంత దిగజారి ప్రవర్తించకండి, నటి అనసూయ తీవ్ర ఆగ్రహం

వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని సైట్స్ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాయని నటి అనసూయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానిప్యులేషన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ గా పరిగణించడం దారుణం అంటూ అసహనం వ్యక్తం చేసింది.

బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని వెబ్ సైట్స్ చేస్తున్న చెత్త పనులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లు సైతం పూర్తి విషయం తెలుసుకోకుండా ఇతరులను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.   

దిగజారు తనం మానుకోండి- అనసూయ

గత కొంత కాలంగా వ్యూస్‌ కోసం కొన్ని సోషల్ మీడియా పేజీలు, వెబ్ సైట్లు,  కొన్ని మీమ్‌ పేజెస్‌, వెబ్‌సైట్స్‌ తన గురించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అనసూయ మండిపడింది. జనాలు చూడాలని మరీ అంత దిగజారడం మంచిది కాదని హితవు పలికింది. ఇప్పటికైనా మ్యానిప్యులేట్‌ చేయడం మానుకోవాలని వెల్లడించింది.  ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది. ‘‘తలాతోక లేకుండా క్లిక్స్‌, వ్యూస్‌ కోసం ఎడిట్‌ చేసి వీడియోలు పెట్టడం ఆపండి. అయినా, అర్థం చేసుకునే వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, పూర్తి విషయం తెలుసుకునే టైమ్ లేనివారికి ఒక విజ్ఞప్తి.  దయచేసి ముందుగా మొత్తం విషయం తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండానే ఎదుటి వారిని అపార్థం చేసుకోకండి. నిజానికి అపార్థం చేసుకోవడం చాలా ఈజీ. కానీ, ఏది వాస్తమో తెలుసుకుని ప్రవర్తించడం అంత తేలిక కాదు” అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది.   

మ్యానిప్యులేషన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుకుంటున్నారా?- అనసూయ

అటు తన ట్వీట్ కు ఓ నెటిజన్ చేసిన కామెంట్ పైనా అనసూయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “వారు క్రియేటర్స్‌. తమ ఫాలోవర్స్‌ ని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటారు” అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. దీనికి అనసూయ గట్టి సమాధానం ఇచ్చింది. “ఒకరి క్యారెక్టర్‌/హార్డ్‌ వర్క్‌/ఫేమ్‌ని పణంగా పెడతారా? వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారో అడగవచ్చా సర్‌? మ్యానిప్యులేషన్‌ను ఎప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అనుకుంటున్నారు?’’ అని కశ్చన్ చేసింది.  రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానెల్ కు అనసూయ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత అంశాలను ప్రస్తావించింది. అయితే, కొన్ని సోషల్ మీడియా పేజీలు, వెబ్ సైట్స్ అనసూయ గురించి రకరకాల మీమ్స్, ఎడిటెడ్ వీడియోలను పబ్లిష్ చేశాయి. వీటిపై తాజాగా అనసూయ స్పందించింది.

వరుస సినిమాలతో అనసూయ బిజీ

అనసూయ రీసెంట్ గా నటించి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘విమానం’, ‘పెదకాపు 1’, ‘ప్రేమ విమానం’ సినిమాల్లో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది.  

Also Read: అందుకే రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget