అన్వేషించండి
Advertisement
FIR Movie: యంగ్ హీరోకి షాక్, సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్
'అరణ్య' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు విశాల్ ఇప్పుడు 'ఎఫ్ఐఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కోలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణు విశాల్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. హీరోగా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు అతడు తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే 'అరణ్య' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు 'ఎఫ్ఐఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఉగ్రవాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చింది. అదే సమయంలో ఈ సినిమాలో చూపించిన కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. ముస్లింలతో పాటు హిందువుల్లో ఓ వర్గం ఈ సినిమా పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడాన్ని ఆ వర్గం వాళ్లు తప్పుబడుతున్నారు. హిందువులు కూడా ఉగ్రవాదుల్లో భాగమే అన్నట్లుగా చూపించడాన్ని హిందువులు తప్పుబడుతున్నారు.
ఈ అంశాల కారణంగానే 'ఎఫ్ఐఆర్' సినిమాకి సెన్సార్ ఇబ్బందులు కూడా వచ్చాయి. కొన్ని దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కి అనుమతివ్వలేదు. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ దాటుకొని సినిమాను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తెలంగాణలో ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
సినిమా పోస్టర్ లో కనిపించే కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ముస్లింలను తప్పుగా చూపించేలా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ ను కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి..!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
హైదరాబాద్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion