By: ABP Desam | Updated at : 26 Dec 2022 06:29 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Sushant Singh Rajput/Instagram
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చినా, ఇప్పటికీ ఆయన మృతిపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, కచ్చితంగా హత్యే చేశారని సుశాంత్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన ఉద్యోగి తేల్చి చెప్పారు.
సుశాంత్ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు
జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో విచారణ నిర్వహించిన పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఆయనది ఆత్మహత్యేనని తేల్చాయి. కానీ, చాలా మంది తన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన మృతిపై ఏదో ఒక మూలన సంశయం వ్యక్తం అవుతూనే ఉంది. అప్పట్లో సుశాంత్ పేరెంట్స్ సహా, ఆయన అభిమానులు, కోస్టార్స్ కూడా దర్యాప్తు విషయంలో చాలా అనుమాలను వ్యక్తం చేశారు. తాజాగా సుశాంత్ కు పోస్టుమార్టం నిర్వహించిన రూప్ కుమార్ షా అనే ఉద్యోగి ఆయనది ముమ్మటికీ హత్యేనని తేల్చి చెప్పారు.
సుశాంత్ ది ముమ్మాటికీ హత్యే- రూప్ కుమార్
సుశాంత్ సింగ్ మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్ కు తరలించారు. ఆ రోజు మొత్తం తాము ఐదుగురికి పోస్టు మార్టం నిర్వహించినట్లు రూప్ కుమార్ చెప్పారు. అందులో సుశాంత్ మృతదేహం కూడా ఉందన్నారు. ఆయన బాడీని పరిశీలించినప్పుడు దేహంపై చాలా గాయాలు కనిపించాయన్నారు. మెడపైన మూడు గాయాలను చూసినట్లు చెప్పారు. వాస్తవానికి సుశాంత్ పోస్టుమార్టం రికార్డు చేయాల్సి ఉన్నా, కేవలం ఫోటోలు మాత్రమే తీయాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు వెల్లడించారు. వారి ఆదేశాల ప్రకారమే తాము వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీసినట్లు చెప్పారు. సుశాంత్ బాడీ చూడగానే, ఆత్మహత్య కాదనిపిస్తుందని సీనియర్లకు చెప్పినట్లు వెల్లడించారు. ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుదామని చెప్పినా, వారు వినలేదన్నారు. వీలైనంత త్వరగా పోటోలు తీసి, పోస్టుమార్టం చేసి , బాడీని పోలీసులకు అప్పగించాలని సూచించారన్నారు. వారి ఆదేశంతోనే రాత్రిపూట పోస్టుమార్టం చేసినట్లు వివరించారు.
This is incriminating evidence in the #justiceforssr case. #CBI @mieknathshinde @Dev_Fadnavis @BJP4Maharashtra @BJP4Mumbai pic.twitter.com/COiF4h66tB
— Ameet Satam (@AmeetSatam) December 26, 2022
సుశాంత్ హంతకులెవరు?
సుశాంత్ మరణంపై అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆయనది కచ్చితంగా హత్యేననే ఆరోపణలు వచ్చాయి. తన కొడుకు మృతి వెనుక మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే మనుషుల హస్తం ఉందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా పైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా అటాప్సీ నిర్వహించిన వ్యక్తి కూడా ఆయనది ఆత్మహత్య కాదని చెప్పడంతో సుశాంత్ మృతి వెనుకున్న హంతకులు ఎవరనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: మూడు రోజుల్లో రూ.11 కోట్లు - బాక్సాఫీస్ ‘పేజీలు’ మారిపోతున్నాయి!
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు