అన్వేషించండి

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ గెటప్‌లో ఏరువాక పౌర్ణమి సంబరాలు, ఎక్కడో తెలుసా?

ఏరువాక పౌర్ణమి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా గుడికల్ ప్రాంత యూత్. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గెటప్ ను ధరించి ఏరువాక సంబరాలు జరుపుకున్నారు.

ఏరువాక పౌర్ణమి.. ప్రతీ రైతు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. వేసవికాలం తర్వాత పల్లేల్లో ప్రజలు వ్యవసాయం ప్రారంభానికి ముందు సూచికగా ఈ పండగను జరుపుకుంటారు రైతులు. పొలాల్లో పంటలు బాగా పండాలని కోరుతూ సంబరాలు జరుపుకుంటారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రైతన్నలు పొలం పనుల్లో తమకు చేదోడువాదోడుగా నిలిచే ఎడ్లకు రంగులద్ది, అలంకరించి వాటికి పూజలు చేస్తారు. పంటలు బాగా పండాలని మొక్కుతారు. అయితే ఈ ఏడాది ఏరువాక పౌర్ణమి పండగను వినూత్నంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా గిడికల్ ప్రాంత వాసులు. ఏరువాక పండుగలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వినూత్న ప్రయత్నం చేశారు. తమ అభిమాన నటుడి వేషధారణలో వస్త్రాలు ధరించి ఊరేగింపుగా సందడి చేశారు.

రామ్ చరణ్ గెటప్ లో ఏరువాక పౌర్ణమి సంబరాలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా  అభిమానుల్ని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది కూడా. అందులో రామ్ చరణ్ తెల్లటి దస్తుల్లో సైకిల్ తొక్కుతూ వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గెటప్ నే కాపీ చేశారు గుడికల్ యూత్. ప్రతీ ఏటా ఏరువాక పౌర్ణమికి తమ ఊర్లో రామ్ చరణ్ అభిమానులంతా కలసి ఆయన సినిమాలో గెటప్ ను వేసుకొని ఊరేగింపుగా ప్రదర్శన చేస్తారట. అందులో భాగంగానే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఆధ్యర్యంలో ఈ ఏడాది కూడా రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ చేంజర్’ లోని రామ్ చరణ్ గెటప్ ను అందరూ  అచ్చుగుద్దినట్టు దించేశారు. అంతే కాదు అంతా కలసి సైకిల్ పై ఊరేగింపుగా వెళ్లారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

వరుస సినిమాలతో బిజీగా రామ్ చరణ్..

రామ్ చరణ్ ప్రస్తుం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన చరణ్ ఈ మూవీ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తో మరో సినిమా చేయనున్నారు. తర్వాత ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటితో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. వీటితో పాటు త్వరలోనే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. 

Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 17: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా
నువ్వులేక నేను లేను: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా
Illu Illalu Pillalu Serial Today October 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి తన భవిష్యత్ చెప్పి వణికించేసిన నర్మద! కేసు వెనక్కి తీసుకోవడమే మార్గం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీకి తన భవిష్యత్ చెప్పి వణికించేసిన నర్మద! కేసు వెనక్కి తీసుకోవడమే మార్గం!
Karthika Deepam 2 Serial Today October 17th: కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget