Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
రవి కిషన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులు వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ 'రేసు గుర్రం' మూవీలోని మద్దాలి శివారెడ్డి అంటే ఈజీగా తెలుస్తుందేమో.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఎన్నో సవాళ్లు ఫేస్ చేశానని ప్రముఖ రాజకీయ వేత్త, బాలీవుడు సినీ నటుడు రవి కిషన్ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రవి కిషన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులు వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ హీరో అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' సినిమాలోని మద్దాలి శివారెడ్డి అంటే ఈజీగా తెలుస్తుందేమో. అయితే 'నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే' అంటూ రవి కిషన్ కీలక కామెంట్లు చేశారు. అసలేమైంది...? అలా ఆయనను బాధించింది ఎవరు..? ఆ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే..
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. కొన్నిసార్లు ఎన్నో నిద్ర లేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది. అలాగే హీరో రవి కిషన్ కూడా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ కూడా రవి కిషన్ ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. తాను కూడా అలాంటి పరిస్థితిని చూశానని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఓ మహిళ నా వద్దకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం’ అని అడిగింది. నాకెందుకో అనుమానం వచ్చి.. సున్నితంగా తిరస్కరించా... అని రవి కిషన్ తెలిపారు. అయితే ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ ఇవ్వని ఆయన.. ప్రస్తుతం ఆమెకు సోసైటీలో ఎంతో పేరు ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక రవి కిషన్ గురించి చెప్పాలంటే బాలీవుడ్ తో పాటు తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించి, మెప్పించారు. ఇక తెలుగులో భారీ హిట్ అందుకున్న హీరో అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమాలో విలన్ ‘మద్దాలి శివారెడ్డి’ క్యారెక్టర్ లో దుమ్ము దులిపేశాడు. 1969లో జూలై 17న ఉత్తర ప్రదేశ్ లోని జౌన్ పూర్ లో జన్మించిన ఆయన.. సినిమాల్లో నటించి బెస్ట్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కిక్ 2, డిక్టేటర్, సుప్రీమ్, లై, రాధా, సాక్ష్యం వంటి తెలుగు సినిమాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక రవి కిషన్ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరుపున 2014 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. అక్కడ అతను 42,759 ఓట్లు లేదా మొత్తం ఓట్లలో 4.25 శాతం మాత్రమే సాధించాడు. ఫిబ్రవరి 2017 లో కిషన్ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రంభువల్ నిషాద్‌పై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కిషన్, రంభువల్ నిషాద్పై 3,01,664 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.
ఇదిలా ఉండగా రవి కిషన్, హీరోయిన్ నగ్మాతో రిలేషన్ లో ఉన్నట్టుగా గతంలో విపరీతమైన వార్తలు వినిపించాయి. ఆ వార్తలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘నటీనటులు కలిసి వరుసగా కొన్ని సినిమాల్లో నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తుంటాయి. వాస్తవానికి అవన్నీ ప్రచారాలు మాత్రమే. మేము కలిసి నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్ కావడంతో మళ్లీ మా కాంబో రిపీట్ అవుతూ వచ్చింది. మేమిద్దరం స్నేహితులం. మా మధ్య మంచి అనుబంధం ఉందంతే. అలాగే, అందరికీ తెలుసు మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పటికే నాకు వివాహమైంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్