Kiraak Boys Khiladi Girls: పెళ్లైనా ఓకే అంటూ స్టేజి మీదే నానికి హగ్ - మరీ ఇంత స్పీడేంటి అమ్మాయ్?
‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఈ షోలో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడిని స్టేజి మీదే ఓ అమ్మాయి హగ్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది.
Nani In Kiraak Boys Khiladi Girls Show: స్టార్ మా వేదికగా జూన్ 29 నుంచి ప్రసారం అవుతున్న‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ షో ముగింపు దశకు చేరుకుంది. ఈ శని, ఆదివారాలతో షోకు ఎండ్ కార్డు పడనుంది. తాజాగా ఈ షోకు సంబంధించి గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల అయ్యింది. శేఖర్ మాస్టర్ దుమ్మురేపే డ్యాన్స్, అనసూయ అంద చందాలు, శ్రీముఖి చలాకీ మాటలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. రెండు టీమ్ లు చేసిన సందడి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో అలరిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్ పోటాపోటీ డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.
పెళ్లైనా ఓకే అంటూ నానీకి హగ్!
‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ గ్రాండ్ ఫినాలే షోకు చీఫ్ గెస్టుగా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. ‘దసరా’ సినిమాలోని పాటకు మాస్ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ లేడీ కస్టెంటెంట్, తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, అయేషా జీనత్ స్టేజి మీదికి వచ్చి నానిని హగ్ చేసుకుంది. శ్రీముఖి “ఆయనకు పెళ్లైంది” అని చెప్పగా.. “ఇట్స్ ఓకే పర్లేదు అండీ” అంటుంది. నాని కూడా “అయితే, నాకూ ఇట్స్ ఓకే!నాక్కూడా పర్లేదు” అని చెప్పడంతో షోలోని వాళ్లంతా ఫుల్ గా నవ్వుతారు.
గ్రాండ్ ఫినాలే కాదు, ఫెయిర్ వెల్ లా ఉంది-నాని
ఇక “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ షో గ్రాంగ్ ఫినాలే కాదు, నాలుగేళ్ల కాలేజీ లైఫ్ కి ఈ రోజు ఫెయిర్ వెల్ లా ఉంది” అందంటూ నాని ప్రశంసలు కురిపించారు. ఈ షో పూర్తి ఎపిసోడ్ లో ఈ శని, ఆది వారల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ గేమ్ షోలో గెలిచిన టీమ్ కు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు.
జూన్ 29న ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ షో ప్రారంభం
‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ అంటూ సాగిన ఈ గేమ్ షో జూన్ 29 నుంచి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. ఖిలాడీ భామలుగా బుల్లితెర బ్యూటీలు, కిర్రాక్ బాయ్స్ గా సీరియల్ యాక్టర్లు రెండు జట్లుగా ఏర్పడి పోటీపడ్డారు. అందాల నటి అనసూయ ఈ ఖిలాడీ బ్యూటీస్ లీడర్ గా వ్యవహరించగా, కిర్రాక్ బాయ్స్ కు శేఖర్ మాస్టర్ లీడర్‌గా కొనసాగారు. హాట్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా కొనసాగింది. తొలి షో ప్రోమోతోనే ఈ షో బాగా పాపులర్ అయ్యింది. ప్రోమోలో భాగంగా అనసూయ తన టాప్ విప్పగా, శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పడం అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పలువురు ఈ షోపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.