రేడియో జాకీ TO సక్సెస్ ఫుల్ హీరో- నాని గురించి మీకు తెలియని నిజాలు! టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 40వ ఏట అడుగు పెట్టారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు నాని. హైదరాబాద్ లో పుట్టిన పెరిగిన నాని, కాలేజీ డేస్ తర్వాత రేడియో జాకీగా పని చేశారు. సినిమాల మీద ఉన్న ఇష్టంతో బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరి పలు సినిమాలకు పని చేశారు. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానూ నాని పని చేశారు. తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 2'తో పాటు పలు అవార్డు ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. 'అష్టా చమ్మా'తో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నాని ఇప్పటి వరకు 30 సినిమాలు చేశారు. సుధీర్ బాబు, నాగార్జున, ఆది పినిశెట్టి, విజయ్ దేవరకొండ, అవసరాల శ్రీనివాస్‌తో కలిసి నటించారు. All Photos Credit: Nani/Instagram