అన్వేషించండి

Manchu Manoj: మంచు లక్ష్మీ మరో మంచి పని - గర్వంగా ఉంది అక్కా అంటూ మనోజ్ పోస్ట్!

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు.

Manchu Manoj: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. మంచు మోహన్ బాబు బాటలోనే ఆయన కొడుకులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలు మరో వైపు కుటుంబ వ్యాపారాలు చక్కదిద్దుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచు వారసులు. తాజాగా మంచు లక్ష్మీ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. అంతే కాదు అందుకు సంబంధించిన ఓ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

30 ప్రభుత్వ పాఠశాలన్ని దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ..

మంచు లక్ష్మీకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆమె ఓ వైపు సినిమాలు చేస్తూనే బయట పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. అందులో భాగంగానే టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు మంచు లక్ష్మీ. పేదవారికి కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుని తన మంచి మనసుని చాటుకున్నారు మంచు లక్ష్మీ.

నిన్ను చూస్తే గర్వంగా ఉంది అక్కా: మంచు మనోజ్

మంచు లక్ష్మీ ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేసే కార్యక్రమంలో భాగంగా మరో 30 స్కూల్స్ ను దత్తత తీసుకోవడం పట్ల మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. తన అక్క తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ ప్రయత్నం ద్వారా పిల్లల భవిష్యత్‌ పై ఎంతో సానుకూల ప్రభావం చూపనుందని అన్నాడు. ఈ కార్యక్రమం చేయడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన గద్వాల్ కలెక్టర్‌ వల్లూరు క్రాంతికు కృతజ్ఞతలు తెలిపాడు మంచు మనోజ్. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మీ తీసుకున్న నిర్ణయం పట్ల మంచు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: ఆర్జీవీకి సుచిత్రా కృష్ణమూర్తి పెళ్లి ప్రపోజల్- వర్మ రియాక్షన్ ఏంటో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget