News
News
X

Bigg Boss Telugu 6: చంటిని చెంపదెబ్బ కొట్టిన ఆర్జే సూర్య, ‘బిగ్ బాస్’ ఇంట్లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీమ్!

రెండు రోజులుగా హౌస్ లో బొమ్మ టాస్క్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రేక్షకులను ఏడిపించేశారు.

FOLLOW US: 
బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం పూర్తి చేసుకోబోతుంది. మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారా..? అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం బయటకు వెళ్లడానికి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?
 
1. రాజశేఖర్
2. రేవంత్
3. అభినయశ్రీ
4. ఆదిరెడ్డి
5. గీతూ
6. షానీ
7. రోహిత్ -మెరీనా
8. ఫైమా. 
 
వీరిలో ఎవరు బయటకు వెళ్తారో చూడాలి. ఇక రెండు రోజులుగా హౌస్ లో బొమ్మ టాస్క్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రేక్షకులను ఏడిపించేశారు. కంటెస్టెంట్స్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో పాటు.. వారి లైఫ్ లో ఉన్న బేబీ గురించి.. 'జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యం' అనే అంశంపై తమ భావాలను పంచుకోమని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలో హౌస్ మేట్స్ అందరూ తమ ఎమోషనల్ స్టోరీలు గురించి చెప్పి.. కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఇదిలా ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' నటీనటులు సుధీర్ బాబు, కృతిశెట్టి హౌస్ లోకి వెళ్లారు. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత కంటెస్టెంట్లంతా స్కిట్ చేసి ఆకట్టుకున్నారు. స్కిట్‌లో భాగంగా సూర్య, చంటిపై చేయి చేసుకున్నట్లు నటించాడు. అయితే, మొదట్లో కాస్త షాకైనా.. ఆ తర్వాత అదే స్కిట్టే కావడంతో అక్కడ నవ్వులు విరిచాయి.  ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.  

Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా?

కీర్తి భట్ ఎమోషనల్ స్టోరీ:
 కార్తీక దీపంలో అమాయకంగా నవ్వుతూ కనిపించే హిమ అలియాస్ కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇంతవరకు ఆమెకు అమ్మానాన్న, ఒక ఫ్యామిలీ లేదని మాత్రమే తెలుసు అందరికీ. కానీ ఆమె ఎప్పటికీ తల్లి కాలేనని బయటపెట్టింది కీర్తి. సిసింద్రీ టాస్కు తరువాత బిగ్ బాస్ ఇచ్చిన బొమ్మలతో అందరూ అనుబంధం పెంచుకున్నారు. దీంతో బిగ్ బాస్ జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యమో చెప్పమని అడిగారు. దీనిలో భాగంగా  కీర్తి భట్ మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలు చెప్పింది.

''నా జీవితం ఎంతో ఆనందంగా సాగింది. కానీ 2017లో అమ్మానాన్న, నేను, అన్నయ్య, వదినా, వాళ్ల చిన్న పాప కలిపి కారులో గుడికి వెళుతున్నాం. యాక్సిడెంట్ అయ్యింది. నేను కళ్లు తెరిచేసరికి నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. అందరూ చనిపోయారని నాకు తెలుస్తోంది. నాకు కాస్త తెలివి వచ్చిన మరుసటి రోజే నాన్న చనిపోయారు. ఆ తరువాత నేను కోమాలోకి వెళ్లిపోయాను. 32 రోజులు కోమాలోనే ఉండి బయటికి వచ్చాను. చాలా గట్టిగా ఏడ్చాను. నన్నెందుకు ఇలా ఒంటరిగా వదిలి వెళ్లారు అని ఏడ్చాను. నన్నెవరూ చూసే వాళ్లు లేరు అని అర్థమైంది. ఒంటరిగా చేతిలో 375 రూపాయలతో బెంగుళూరు వచ్చా. 355 రూపాయలు బస్సు టిక్కెట్ కు ఖర్చయింది. చాలా ఆకలి వేస్తున్నా ఏమీ తినలేకపోయా. చివరికి కుక్కలకు వేసిన బ్రెడ్డు తీసుకుని తిన్నా.’ అని చెప్పుకొచ్చింది. ‘పరిస్థితులు బాగయ్యాక ఓ పాపను పెంచుకున్నా. ఆమెకు తను అని పేరు పెట్టా. తను వచ్చాకే నాకు జీవితంపై ఆశ పెరిగింది. పాపకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బిగ్ బాస్ కి రావడానికి ముందే తను చనిపోయిందని కాల్ వచ్చింది. ఆమె చనిపోయినప్పుడు కూడా నేను పక్కన లేకపోవడం చాలా బాధనిపించింది'' అంది.
Published at : 16 Sep 2022 02:49 PM (IST) Tags: aa ammayi gurinchi meeku cheppali Bigg Boss 6 Bigg Boss Telugu 6

సంబంధిత కథనాలు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!