Geetha Govindam: మా ప్రేమకు అయిదేళ్లు, రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు ఐదేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రష్మిక పెట్టిన పోస్టు ఆసక్తి కలిగిస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూ. 5 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది. రష్మికతో పాటు విజయ్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రం తర్వాత విజయ్, రష్మిక స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిపోయారు. 2018లో ఆగస్టు 15న విడుదలైన ‘గీత గోవిందం’ మూవీ రీసెంట్ గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్, పరుశు రామ్, రష్మిక మందన్న కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా తెరకెక్కిస్తున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
మా ప్రేమకు 5 ఏండ్లు- రష్మిక
‘గీత గోవిందం’ సినిమా 5 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టింది. మా ప్రేమకు ఐదేళ్లు అంటూ విజయ్, పరుశురామ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పనిలో పనిగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పింది. అటు విజయ్ తో ఐదేండ్లుగా ప్రేమాయణం నడుపుతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అటు ఐదేండ్ల ‘గీత గోవిందం’ సినిమా గురించి విజయ్ సైతం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. “ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ‘గీత గోవిందం’ సినిమాకు ఐదేండ్లు పూర్తయ్యాయి” అని వెల్లడించారు. మొత్తంగా విజయ్, రష్మిక మందన్న ఒకేచోట కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
View this post on Instagram
విజయ్, రష్మిక డేటింగ్ రూమర్స్
ఇక గత కొంతకాలంగా విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బ్యూటిఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా కలిసి తిరగడం ఆసక్తి కలిగించింది. ‘గీత గోవిందం’ సినిమాతో పాటు ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు రియల్ లైఫ్ లోనూ చాలా క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీలు, ట్రిప్పులు అంటూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంటికి కనిపించారు. వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ వార్తలపై రష్మిక, విజయ్ పెద్దగా స్పందించలేదు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తాజా ప్రాజెక్టులు
ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్టులు చేస్తోంది. రణబీర్ కపూర్‌తో 'యానిమల్' అనే చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప 2' మూవీ చేస్తోంది. అంటు 'రెయిన్‌బో', 'డి 51' చిత్రాల్లోనూ కనిపించనుంది. అటు విజయ్ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ విడుదలకు రెడీ అవుతోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
Read Also: దళితులపై ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు, కర్నాటక హైకోర్టు ఏం చెప్పిందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial