అన్వేషించండి

Sankranti Movies 2024: వచ్చే సంక్రాంతికి రెడీ అవుతున్న స్టార్ హీరోలు , ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదా?

2024 సంక్రాంతికి చాలా పెద్ద సినిమా రిలీజ్ లే ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు అల్లు అర్జున్ 'పుష్ప-2', ప్రభాస్ 'ప్రాజెక్ట్-K', రామ్ చరణ్ 'RC15'. ఈ చిత్రాలు పై సినీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు విడుదల అయి భారీ విజయాన్ని, కలెక్షన్లను సాధిస్తుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద సినిమాలు విడుదలకు పోటీపడుతూ ఉంటాయి. అంతగా ఈ పండగ సీజన్ కు డిమాండ్ ఉంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సంక్రాంతి పండక్కి సినిమాలు విడుదల అయ్యాయి. ఇక వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే పెద్ద సినిమాల లిస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో విడుదల తేదీలు కంఫర్మ్ చేసుకోవడానికి సిద్దపడుతున్నారు మేకర్స్. 

ఇప్పటికే అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’, ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’, రామ్ చరణ్ హీరోగా ‘ఆర్ సి 15’ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ లు శర  వేగంగా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మహేష్ సినిమా మినహా మిగతా సినిమాలు అన్నీ వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక మహేష్ సినిమా షూటింగ్ కు మధ్యలో గ్యాప్ రావడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మూవీను 2024 జనవరి 12 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మొదటి భాగం దేశవ్యాప్తంగా హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై ఉత్కంఠ మొదలైంది. అలాగే శంకర్-రామ్ చరణ్ బిగ్ కాంబో పై కూడా అంచానాలు విపరీతంగా ఉన్నాయి. వీటితో పాటు మహేష్ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతికి భారీ పోటీనే ఉంటుందంటున్నారు. 

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మినహా మిగతా సినిమాలు విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది కూడా సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైటే జరిగింది. ఈ రెండు సినిమాలు నిర్మించింది ఒకే సంస్థ అయినా వీటితో పాటు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కావడంతో థియేటర్ల పంపిణీ లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఒకేసారి  అన్ని పెద్ద సినిమాలు విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదంటున్నారు సినీ నిపుణులు. మరి వచ్చే సంక్రాంతి సమయానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Releases : బాహుబలి టార్చ్‌బేరర్ To హారర్ థ్రిల్లర్ సిరీస్ - శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్
బాహుబలి టార్చ్‌బేరర్ To హారర్ థ్రిల్లర్ సిరీస్ - శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్
Peddi Collections Day 22: పెద్దిగాడికి నాలుగో వారంలోనూ కలెక్షన్లు... ఇప్పుడు కోటి కంటే తక్కువ - రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్
పెద్దిగాడికి నాలుగో వారంలోనూ కలెక్షన్లు... ఇప్పుడు కోటి కంటే తక్కువ - రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Nuvvu leka Neanu Lenu Serial Today June 26th: విక్కీ ఇంట్లో నుంచి పారిపోయేలా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు ఏంటి...?
నువ్వులేక నేను లేను: విక్కీ ఇంట్లో నుంచి పారిపోయేలా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు ఏంటి...?

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget