అన్వేషించండి

Theatre-OTT Releases: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ప్రతి వారం మాదిరిగానే ఈవారం సైతం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరికొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఈ వీక్ లో థియేటర్‌, ఓటీటీలో అలరించే చిత్రాలేవో చూద్దాం!

గత వారం ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం సైతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు చిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్లు, అటు ఓటీటీల్లో విడుదలకాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

శాకుంతలం
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా పాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్ నటించారు. సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టబోతోంది.   

రుద్రుడు
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రుద్రుడు’. ఈ సినిమాకు కతిరేశన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.  ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది.  శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.

విడుదల

‘విడుదలై’ పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ‘విడుదల’ పేరుతో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 15న తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.  

ఓటీటీలో అలరించనున్న సినిమాలు

ఆహా
దాస్ కా ధమ్కీ- విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన ‘దాస్ కా ధమ్కీ’  ఏప్రిల్ 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది. నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ‘ఆహా’లో ఏప్రిల్ 14 నుంచి   స్ట్రీమింగ్ కు రానుంది.   

డిస్నీ+హాట్‌స్టార్‌

ఓ కల- చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా ‘ఓ కల’. ఈ నెల 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య, రంజిత్ కుమార్, ఆదిత్య రెడ్డి నిర్మించారు.  ప్రేమ ఉన్నా, ఆ విషయాన్ని చెప్పకపోవడంతో ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుందో ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.

నెట్‌ఫ్లిక్స్‌

ఫ్లోరియా మాన్‌,  అబ్సెషన్‌ అనే వెబ్ సిరీస్ లు ఏప్రిల్‌ 13 స్ట్రీమింగ్ కానున్నాయి.

 ది లాస్ట్‌ కింగ్‌డమ్‌ అనే హాలీవుడ్ చిత్రం ఏప్రిల్‌ 14 విడుదల కానుంది.

అమెజాన్‌ ప్రైమ్

ది మార్వెలస్‌ మిస్సెస్‌ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్ కు రానుంది.

జీ5

రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన ‘మిస్సెస్‌ అండర్‌కవర్‌’ అనే హిందీ చిత్రం ఏప్రిల్‌ 14 ప్రేక్షకుల ముందుకురానుంది.

Read Also: అందుకే ‘శాకుంతలం’ నేటితరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది : సమంత

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget