అన్వేషించండి

YSR Kadapa District Candidates: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు వీళ్లే

Kadapa District Candidates : రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అటువంటి జిల్లాల్లో కీలకమైనది కడప జిల్లా.

Andhra Pradesh News: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అటువంటి జిల్లాల్లో కీలకమైనది వైఎస్‌ఆర్‌ కడప జిల్లా. ఈ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు సగం స్థానాల్లో అయినా విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, కూటమి పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ప్రధాన పార్టీలు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వివరాలు మీకోసం. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే

కడప జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు ఈసారి ఇరు పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. ఆర్థిక, సామాజిక సమీకరణాలతోపాటు స్థానికంగా వారికి ఉన్న బలం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బోజా రోషన్న బరిలోకి దిగుతున్నారు. కోడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె శ్రీనివాసులు పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా యనమల భాస్కర్‌ రావును జనసేన నుంచి బరిలో దింపుతున్నారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్‌ రఘరామిరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. కమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎం సుధీర్‌ రెడ్డి, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. 

కడప జిల్లాలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే 

నియోజకవర్గం పేరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు  ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు
బద్వేలు (Badvel Assembly constituency) దాసరి సుధ(Dasari Sudha) బోజా రోషన్న(టీడీపీ)(Bojja Roshanna)
కోడూరు (Kodur ) కె శ్రీనివాసులు(k srinivasulu) యనమల భాస్కర్ రావు(జనసేన)(Bhaskar Rao Yanamala)
మైదుకూరు (Mydukur Assembly constituency) ఎన్‌ రఘరామిరెడ్డి(N Raghurami Reddy) పుట్టా సుధాకర్‌ యాదవ్‌(టీడీపీ)(Putta Sudhakar Yadav)
కమలాపురం (Kamalapuram Assembly constituency) పి రవీంద్రనాథ్‌ రెడ్డి(P Ravinder Reddy ) పుత్తా చైతన్య రెడ్డి(టీడీపీ)(Putha Chaithanya Reddy )
రాజంపేట (Rajampet Assembly constituency) ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి(Akepati Amarnath Reddy) సుగవాసి సుబ్రహ్మణ్యం(టీడీపీ)(Subramanayam Saugavasi)
జమ్మలమడుగు (Jammalamadugu Assembly constituency) ఎం సుధీర్‌ రెడ్డి(Mule Sudheer Reddy) ఆదినారాయణ రెడ్డి(బీజేపీ)

పులివెందుల నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ప్రొద్దుటూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడప నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజాద్‌ భాషా వైసీపీ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాధవిరెడ్డి బరిలోకి నిలుస్తున్నారు. రాయచోటి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా రాం ప్రసాద్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

కడప జిల్లాలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే 

నియోజకవర్గం పేరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు  ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు
పులివెందుల(Pulivendla Assembly constituency) జగన్మోహన్‌ రెడ్డి(Jagan Mohan Reddy) మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి(టీడీపీ)(Mareddy Ravindranath Reddy)
ప్రొద్దుటూరు(Proddatur) రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి(Rachamallu Siva Prasad Reddy) వరదరాజులు రెడ్డి(టీడీపీ)(Nandyala Varada Rajulu Reddy)
కడప(Kadapa) అంజాద్‌ భాషా(Amzath Basha Shaik Bepari) మాధవిరెడ్డి(టీడీపీ)(
Madhavi Reddy
)
రాయచోటి(Rayachoty) గడికోట శ్రీకాంత్‌ రెడ్డి(Gadikota Srikanth Reddy) రాం ప్రసాద్‌ రెడ్డి(టీడీపీ)(Ram Prasad Reddy )

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget