UP Election Result 2022 LIVE: యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ, మరో 65 స్థానాల్లో ఆధిక్యం
UP Election Result 2022 LIVE updates: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి

Background
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో యూపీపైనే అందరి దృష్టి ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాల లెక్కింపు కోసం 75 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఉత్తర్‌ప్రదేశ్ (UP Election Result 2022) సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఏబీపీ- సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఓసారి చూద్దాం.
యూపీలో కమలం (BJP In UP)
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం యూపీలో మళ్లీ భాజపా సర్కార్ రానున్నట్లు తేలింది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో భాజపా మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. భాజపా 228 నుంచి 240 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 14 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 6 నుంచి 10 సీట్లకే సరిపెట్టుకోనున్నట్లు తేలింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022
ఏబీపీ న్యూస్, సీఓటర్ ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
UttarPradesh: యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ, మరో 65 స్థానాల్లో ఆధిక్యం
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్(202)ను బీజేపీ దాటేసింది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 208 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 78 స్థానాల్లో గెలుపొందింది. మరో 46 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉంది.
UttarPradesh: యూపీలో యోగీ హవా, మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా బీజేపీ
యూపీలో బీజేపీ దూసుకుపోతుంది. తాజా ఫలితాల మేరకు 196 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, మరో 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీ 70 స్థానాల్లో గెలవగా, 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూపీలో వరుసగా రెండో సారి బీజేపీ అధికారం చేపట్టే దిశంగా ఫలితాలు ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది.





















