అన్వేషించండి

UP Election Result 2022: యూపీలో భాజపా ఘన విజయం- కాషాయ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బీఎస్పీ, కాంగ్రెస్

UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మునుపటి ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గినా ఓటు షేర్ మాత్రం పెరిగింది.

UP Election Result 2022: ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైంది.. ఉత్తర్‌ప్రదేశ్‌ మళ్లీ భాజపా వశమైంది. దేశ రాజకీయాలను శాసించే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లలో భాజపా, అప్నాదల్ కూటమి 267 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీని సాధించింది.

భాజపాకి 255 సీట్లు, అప్నాదల్‌కు 12 సీట్లు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు సాధించిన కమలనాథులకు ఈసారి సీట్లు తగ్గినా ఓట్లు పెరగడం విశేషం. అయితే మరోసారి సీఎం అవ్వాలని ఆశించిన అఖిలేశ్ యాదవ్‌కు నిరాశే మిగిలింది.

ఎస్పీ కూటమికి

ఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమికి 119 స్థానాలు దక్కాయి. ఎస్పీ 111 స్థానాల్లో ఆర్‌ఎల్డీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2017 ఎన్నికల్లో 47 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. కర్హాల్ స్థానంలో పోటీ చేసిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ 60 వేల మెజార్టీతో విజయం సాధించారు.

పత్తా లేదు

మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.

యోగి రికార్డు

తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో లక్షా రెండు వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

> ఉత్తర్‌ప్రదేశ్‌ చరిత్రలో ముగ్గురు సీఎంలు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు.వీరిలో యోగి ఆదిత్యనాథ్ మూడో వ్యక్తి.

> యూపీలో గత 15 ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి రికార్డ్. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే సీఎంలుగా ఉన్నారు.

> యూపీలో 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు.

> యూపీని ఇప్పటివరకు పాలించిన నలుగురు ముఖ్యమంత్రుల్లో యోగి మాత్రమే అధికారాన్ని కాపాడుకున్నారు.

Also Read: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయం ఏం చెబుతోంది?

Also Read: Election 2022: బీజేపీని పడగొట్టడం ఇక ఎవరి వల్లా కాదా...?

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి జైత్రయాత్ర కొనసాగాలి.. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పిలుపు!
పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి జైత్రయాత్ర కొనసాగాలి.. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పిలుపు!
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget