News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పోటీలో నిలిచే ప్రత్యర్థులు ఎవరు? బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో ఒకటే చర్చ!

టికెట్ దక్కిన బీఆర్‌ఎస్‌ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ రెడీ అవుతున్నాయ్. ఏ యే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించేసింది. టికెట్ దక్కని నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు...బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ సీనియర్ నేతలను.... రంగంలోకి దించింది. టికెట్ దక్కని నేతలకు...నామినేటేడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తామని హామీలు ఇస్తోంది. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచిస్తోంది. కొందరు నేతలు బుజ్జగింపులతో మెత్తబడినా...మరికొందరు అలకవీడటం లేదు. 

టికెట్ దక్కిన బీఆర్‌ఎస్‌ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు. వారి సామాజిక వర్గాలు ఏంటి ?ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరు ? బలహీనతలు, బలాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి వివరాలు తెప్పించుకుంటున్నారు.  సన్నిహితులు, పార్టీ నేతల ద్వారా...ప్రత్యర్థుల బ్యాక్ గ్రౌండ్ కనుక్కుంటున్నారు. వారి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయ్. ఏ యే గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయ్ ? అన్న అంశాలపై దృష్టి సారించారు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే వారిని ప్రకటించకపోయినా...బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.  కీడెంచి...మేలు ఎంచాలన్న టార్గెట్ తో పని చేస్తున్నారు. గులాబీ బాస్ ఎన్నో ఆశలతో టికెట్ కేటాయించారని...గెలిచి తీరాలన్న వ్యూహాలతో నేతలు ప్రచారం షూరూ చేసేశారు. కాంగ్రెస్ క్యాండేట్ ను ఎలా ఇరుకున పెట్టాలి. బీజేపీని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్న అంశాలతో ఎజెండాను రెడీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలోకి రాకముందే...ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టేశారు. గ్రామాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని...ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని తెలుసుకుంటున్నారు. 

ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే..ఏం చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు  వచ్చిన ఓట్లు ఎన్ని వంటి వివరాలను బీఆర్‌ఎస్‌  అభ్యర్తులు సేకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫిక్సయిన తర్వాత...దూకుడుగా వ్యవహరించాలని బీఆర్‌ఎస్‌ నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఓటర్లకు ఇప్పటి నుంచే తాయిలాలు ప్రకటించేస్తున్నారు. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్న గ్రామాలపై నేతలు కాన్సట్రేట్ చేశారు. ప్రత్యర్థి పార్టీల సెకండ్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఏం కావాలో అన్ని చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. నగదుతో పాటు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. ఫ్యూచర్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

ఇప్పుడు ఏ నియోజకవర్గం చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు ముఖ్యంగా టికెట్ దాదాపు ఖరారు అయినవాళ్లు కేడర్‌ను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఐదు పదేళ్లలో వాళ్లు చేసిన తప్పులు చిట్టాలపై ఆరా తీస్తున్నారు. అధికార పాార్టీ చేపట్టే వ్యూహానికి విరుగుడు ప్లాన్‌తో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయ. అయితే టికెట్ కేటాయించిన తర్వాత ఎంత మంది రెబల్స్ అవుతారో అన్న గుబులు కూడా ప్రతిపక్షాల్లో ఉంది. 

Published at : 25 Aug 2023 06:55 AM (IST) Tags: BJP CONGRESS Telangana Assembly Elections BRS Telangana elections 2023 Telangana Assembly Elections 2023

ఇవి కూడా చూడండి

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ

జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

Telangana Elections 2023: డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు-11న ఫలితాలు-తాత్కాలిక షెడ్యూల్‌ రూపకల్పన

Telangana Elections 2023: డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు-11న ఫలితాలు-తాత్కాలిక షెడ్యూల్‌ రూపకల్పన

కడియంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు, యూటర్న్ తీసుకున్న తాడికొండ రాజయ్య

కడియంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు, యూటర్న్ తీసుకున్న తాడికొండ రాజయ్య

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !