అన్వేషించండి

P Ggannavaram Assembly Constituency: పి గన్నవరం రాజకీయ ముఖచిత్రం ఇదే.. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో

P Gannavaram: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం పి గన్నవరం. ఈ నియోజకవర్గంలో తొలిసారి 1962లో ఎన్నికలు జరిగాయి.

P Gannavaram Assembluy Constituency: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం పి గన్నవరం. ఈ నియోజకవర్గంలో తొలిసారి 1962లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ ఏడుసార్లు విజయం సాధించగా, ఐదుసార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,95,327 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 96,683 మంది కాగా, మహిళా ఓటర్లు 98,643 మంది ఉన్నారు. 

ఎన్నికల ఫలితాలు ఇవే

ఇప్పటి వరకు పి గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువసార్లు అండగా నిలబడ్డారు. తొలిసారి 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణేశ్వరరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన బి నరసింహరావుపై 9590 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గడ్డం మహలక్ష్మి ఇక్కడ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణపతిరావుపై 11,676 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గడ్డం మహలక్ష్మి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎన్‌ గణపతిరావుపై 2162 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణపతిరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్‌ పేములుపై 14,504 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణపతిరావుపై 17,765 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గడ్రం రామారావుపై 23,783 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణపతిరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావుపై 4473 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉండ్రు కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ గణపతిరావుపై 28,056 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బత్తుల వెంకటరావుపై 10,481 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన వేమ అయ్యాజీ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె కృష్ణమూర్తిపై 16,592 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పి రాజేశ్వరీదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన అయ్యాజీ వేమపై 9281 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పి రాజేశ్వరిదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తిపై 3105 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణమూర్తి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కొండేటి చిట్టిబాబుపై 13,505 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్‌ స్టాలిన్‌బాబుపై 22,207 ఓట్ల తేడాతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ ఇక్కడ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget