అన్వేషించండి

Chandrababu: చంద్రబాబు నివాసానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు - ఉన్నతాధికారుల శుభాకాంక్షలు, దారులన్నీ అటువైపే!

Andhrapradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. అటు, సీఎస్, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leaders Flocking To Chandrababu Residence: ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కలిసేందుకు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా ఆయన నివాసానికి క్యూ కట్టారు. అటు, ఉన్నతాధికారులు సైతం ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అటు, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబుతో సుమారు అరగంట పాటు చర్చించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.

పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బాలకృష్ణ, కేశినేని చిన్ని, బొండా ఉమ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడెప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు చంద్రబాబును కలిశారు.

ఢిల్లీకి చంద్రబాబు, పవన్

విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీయే సమావేశానికి వారు హాజరు కానున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు. 

Also Read: Chandrababu: 'సుదీర్ఘ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు' - భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు, హిస్టారికల్ విక్టరీ అన్న చంద్రబాబు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Embed widget