అన్వేషించండి

Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!

Assembly Elections 2026: కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 296 స్థానాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
  • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య, అస్సాంలో ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య పోరు.
  • పుదుచ్చేరిలో 30 స్థానాలకు 284 మంది అభ్యర్థులు, కూటముల మధ్య పోటీ.
  • మే 4న ఎన్నికల ఫలితాలు, జాతీయ స్థాయిలో కూటముల బలాబలాలను నిర్ధారిస్తాయి.

Assembly Elections 2026: కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7  గంటల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. 

కేరళలో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య పోరు 

కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్ంట్, యునైటెడ్‌ డెమోక్రటిక్ ఫ్రంట్‌ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎల్డీఎఫ్‌ 99 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ నేతృతవంలోని యూడీఎఫ్‌ 41 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 

అస్సాంలో ఎన్డీఏ కోట భద్రమేనా?

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమిగా బరిలోకి దిగింది. వారిని ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ కలిపి ఇండీ అలియన్స్‌గా బరిలోకి దిగి గట్టి పోటీని ఇచ్చాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. 

పుదుచ్చేరిలో పాగా వేసేది ఎవరు?

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పుదుచ్చేరి ప్రాంతంలో 23, కారైక్కాల్‌లో 5 మహే, యానాంలో ఒక్కో స్థానం ఉంది. ఈ 30 స్థానాల కోసం మొత్తం 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు 34 మంది ఉన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, బీజేపీ కూటమి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ఎన్‌ రంగస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా ఆ రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా బరిలోకి దిగాయి. వీరిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి కూటమిగా పోటీ చేస్తున్నాయి. 

నిఘా నీడలో మూడు ప్రాంతాలు 

ఎన్నికల కమిషన్ ఈ మూడు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన ఓటింగ్ సాయంత్రం వరకు సాగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల అంటే మే 4వ తేదీ వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, జాతీయ స్థాయిలో కూటముల బలాబలాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగే కేంద్రాలకు వస్తుండటంతో, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పుదుచ్చేరీ వంటి ప్రాంతాల్లో స్వతంత్రులు, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ జాతీయ పార్టీల కూటములు మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది.            

Frequently Asked Questions

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడు ప్రారంభమైంది?

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

కేరళలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మరియు ప్రధానంగా ఏ కూటముల మధ్య పోరు నెలకొంది?

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మరియు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్య పోరు నెలకొంది.

అస్సాంలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది?

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

పుదుచ్చేరిలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరియు ఎన్ని నియోజకవర్గాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పుదుచ్చేరి ప్రాంతంలో 23, కారైక్కాల్‌లో 5, మహే మరియు యానాంలో ఒక్కో స్థానం ఉన్నాయి.

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల అంటే మే 4వ తేదీన వెలువడనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget