అన్వేషించండి
Jagan Resign : సీఎం పదవికి రాజీనామా - గవర్నర్‌కు లేఖ పంపిన జగన్
Jagan Resign for CM Post : సీఎం పదవికి రాజీనామా చేస్తూ లేఖను గవర్నర్‌కు పంపారు జగన్ . సాధారణంగా వెళ్లి రాజీనామా లేఖ స్వయంగా ఇవ్వడం సంప్రదాయం. కానీ జగన్ పట్టించుకోలేదు.

గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన జగన్
Jagan sent resigning letter For The post of CM to the governor : ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ పంపారు. సిట్టింగ్ సీఎం ఎన్నికల్లో ఓడిపోతే నేరుగా గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయం . అయితే జగన్ గవర్నర్ ను కలవడానికి ఇష్టపడలేదు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. రాజీనామా లేఖను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరుతూ రాజ్ భవన్ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకూ జగన్ ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















