అన్వేషించండి

Koneru Konappa: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్, మాజీ ఎమ్మెల్యే గుడ్ బై!

Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు.

Telangana News: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఢిల్లీలో అభ్యర్థుల ఖరారుపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన టీపీసీసీ.. వారిలో కొంతమంది పేర్లను షార్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ లిస్ట్‌ను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. అయితే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న వేళ టీ పాలిటిక్స్‌లో నేతలు వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వగా.. తాజాగా  సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కలిశారు.

త్వరలో నిర్ణయం తీసుకుంటా

రేవంత్ రెడ్డితో జరిగిన భేటీపై కోనేరు కోనప్ప క్లారిటీ ఇచ్చారు.  నియోజకవర్గ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డిని కలిశానని, ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆనను ఆయన ఆహ్వానించారని అన్నారు. పార్టీ మార్పుపై నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నానని, కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తుపై ఆయన విమర్శలు కురిపించారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం తనకు అసలు ఇష్టం లేదని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి తాను పనిచేయలేనని తెలిపారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధ కలిగించాయని,  తనను, తన కుటుంబాన్ని దూషించిన ప్రవీణ్ కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం నచ్చలేదన్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయాలని ఆర్‌ఎస్పీ ఎంతో ప్రయత్నించారని, అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయలేనని పేర్కొన్నారు.

ఆర్‌ఎస్పీ తనపై ఎందుకు పోటీ చేశారు?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపైనే ఎందుకు పోటీ చేశారని కోనేరు కోనప్ప ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వ్‌  డ్ నియోజకవర్గాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, కానీ తనపై పోటీ చేశారని అన్నారు.  ఆర్ఎస్పీ తనపైనే ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్ నంచి తనకు ఎలాంటి హామీ రాలేదని, అయినా చేరుతానని అన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ సిద్దాంతాలను తాను వ్యతిరేకించడం లేదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పనిచేయలేకనే బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆర్‌ఎస్పీ ఎన్నికలకు ముందు తీవ్రంగా విమర్శించారని, అలాంటి ఆయనతో పొత్తు ఎలా పెట్టుకుంటారని కోనేరు కోనప్ప ప్రశ్నించారు.

పొంగులేటితోనూ భేటీ

బుధవారం ఉదయం  సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కోనేను కోనప్ప భేటీ అయ్యారు.  కాంగ్రెస్‌లో చేరే విషయంపై ఆయనతో చర్చించారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని పొంగులేటికి చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. దీనిపై అసంతృప్తితో ఉన్న కోనప్ప.. బుధవారం కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వచ్చారు. అనంతరం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget