అన్వేషించండి

Tension In Tadipatri : తాడిపత్రిలో కౌంటింగ్ టెన్షన్ - ప్రధాన నేతలంతా ముందస్తు బెయిళ్ల పైనే !

Elections 2024 : తాడిపత్రిలో కౌంటింగ్ టెన్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ అనంతరం ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన అభ్యర్థులంతా నియోజకవర్గానకి దూరంగానే ఉంటున్నారు.


Tadipatri Counting : ఆంధ్రప్రదేశ్ లో  హైవోల్టేజ్ రాజకీయం  జరిగే నియోజకవర్గాల్లో ఒకటి తాడిపత్రి. పోలింగ్ రోజు అభ్యర్థులు ఒకరి ఇళ్లను మరొకరు ఆక్రమించుకుని  చేసిన రాజకీయం చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కౌంటింగ్త తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు. అభ్యర్థులు ఎవరూ తాడిపత్రిలో ఉండే పరిస్థితి  లేదు. అందరూ ఔటాఫ్ స్టేషనే. కీలక నేతలంతా ముందస్తు బెయిల్స్ పై ఉన్నారు. ఈ కారణంగా అందరూ కౌంటింగ్ సెంటర్‌లోకి మాత్రమే  రానున్నారు. 

 తాడపత్రి పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి పద్ధతిని ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు జరిగిన అల్లరిలో భాగంగా ఇప్పటికే ఏడుగురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసుల్లో  తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డికి కూడా ముందస్తు మంజూరు చేశారు.  ఇందులో భాగంగా తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డికి కూడా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు అయింది.  తాడపత్రి అల్లర్ల ఘటనలో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయు గోళాలను  ప్రయోగించారు ఈ క్రమంలో భాష్పవాయువు పొగను జేసీ ప్రభాకర్ రెడ్డి పిల్చుకోవడంతో  తీవ్ర అస్వస్థకు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.  ఆరోగ్యరీత్యా పోలీసులు తనపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించి  ఉపశమనం పొందారు.                                

ఇప్పటికేపెద్ద ఎత్తున అల్లర్లలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. నేర చరిత్ర ఉన్నవారిని బైండోవర్ చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా అల్లర్లకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని  ఇప్పటికే పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక  భద్రతా బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజు మాత్రమే కాదు  మరో పదిహేను రోజుల పాటు తాడిపత్రిలో బలగాలు ఉంటాయి. కౌంటింగ్ అనంతరం ఏ పార్టీ అధికారంలో వచ్చినా కొన్ని  కీలకమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం మారితే జేసీ వర్గాలు... వైసీపీ మళ్లీ అధికారం చేపడితే మరో విధంగా స్పందించే అవకాశం ఉంది .                                 

ఫలితం ఎలా వచ్చినా గొడవలు జరుగుతాయని.. ఆస్తుల విధ్వంసం ఉంటుందని ఇంటలిజెన్స్ రిపోర్టులు ఉండటంతో పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని.. గత ఐదేళ్ల కాలంలో ఏర్పడిన పోటా పోటీ రాజకీయాల వల్లనే ఈ సమస్య వచ్చిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.                         

 

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
AP Local Body Elections: స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget