Tirupati Betting Season : చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ రాజకీయాలు - అసలు కన్నా బెట్టింగ్ బడ్జెట్టే ఎక్కువ !
Elections 2024 ; చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై భారీగా బెట్టింగ్ నడుస్తోంది. అన్ని పార్టీల నేతలు తమ వారు గెలుస్తారన్న నమ్మకంతో ఆస్తులు తాకట్టు పెట్టి మరీ బెట్టింగులు కాస్తున్నారు.
Tirupati Betting Market : నిన్నటి వరకు క్రికెట్ సాగింది... నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వీటిని అందరూ చూసారు.. మరి వీటిని ఆసరాగా చేసుకుని బెట్టింగ్ లకు తెర తీశారు పంటర్లు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జూన్ 4వ తేదీన విలువడివి ఫలితాలకు సంబంధించి వందల కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఎవరు గెలుస్తారో ఎవరు ముగునుతారో ప్రజల నిర్ణయం ఎటు వైపు అనేది తేలిపోయింది. రాజకీయ నాయకులు కావడంతో నాయకులు, పార్టీలో పెట్టిన ఖర్చు సంగతి అటు ఉంచితే... వీటిపై ఆధారపడి బెట్టింగ్ రాయుళ్లు చేస్తున్న పందాలు ఎన్నికల ఖర్చు మంచి పోతుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. కుప్పం, పుంగనూరు, నగరి, చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి ఇలా 14 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ ల వెనుక రాజకీయ నాయకులు, వారి బంధువులు కీలకంగా ఉన్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనేది అందరికి ఉన్న ఆసక్తి. దీని పైన భారీగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. కొన్ని స్థానాల పైన అయితే 1కి 5 రెట్లు అధికంగా కూడా బెట్టింగ్ సాగుతుంది. మరో వైపు బెట్టింగ్ వేస్తున్న వారిలో అధిక శాతం పార్టీల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసే నాయకులపై వేస్తున్నారు. ఆ తర్వాత నాయకులు పైన... ఎంత మెజారిటీ... ఏ మండలం నుంచి ఎంత మెజారిటీ ఇలా వివిధ రకాల బెట్టింగ్ లు సాగుతున్నాయి.
ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి ముగింపు వరకు జోరుగా బెట్టింగ్ లు సాగాయి. ఇప్పుడు జూన్ 4న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల పై జరుగుతున్న బెట్టింగ్ పై పోలీసుల నిఘా కొరవడిందని స్పష్టమవుతోంది. బెట్టింగ్ లు జరుగుతున్నాయని... ఎవరు నిర్వహిస్తారో కూడా తెలుసు... ఆన్ లైన్ విధానం లో జరుగుతున్న బెట్టింగ్ లను ఎలా కాని పెట్టాలో తెలుసు కాని ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఎక్కడా బెట్టింగ్ ల పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల విధులకు అందరిని కేటాయించామని పోలీస్ అధికారులు చెబుతున్న కోట్లాది రూపాయల చేతులు మారే బెట్టింగ్ ల పై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అంచనా ప్రకారం సుమారు రూ.50కోట్ల పైన బెట్టింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బెట్టింగులు కట్టే విషయంలో రాజకీయ పార్టీల నాయకులు కూడా తగ్గడం లేదు. కొంత మంది ఖర్చులను వెనక్కి తెచ్చుకోవడనికి ప్రత్యర్థులు గెలుస్తారని కాస్తున్నారు. ఒక వేళ పందెం ఓడిపోయినా తమ పార్టీ అధికారంలోకి వస్తే అంతకంత సంపాదించకోవచ్చని ఆలోచన చేస్తున్నారు.