అన్వేషించండి

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు

Andhra Politics : చంద్రగిరి నేతల నామినేషన్ల కారణంగా తిరుపతిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఒకే సారి రావడంతో సమస్య ప్రారంభమయింది.

Chandragiri leaders created tension in Tirupati : తిరుపతిలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి నామినేషన్ వేయడానికి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఇందు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం దగ్గర గుమికూడారు. అంతకు ముందే  టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్లు వేసేందుకు లోపలికి వెళ్లారు. వారు లోపలికి వెళ్లిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందంటూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలు ప్రతి దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

లాఠీచార్జి  చేసి చెల్లాచెదురు చేసిన  పోలీసులు                                           

ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అభ్యర్థులు ఇద్దరూ నామినేషన్లు వేసి వెళ్లిపోయేంత వరకూ  చుట్టుపక్క ఎవర్నీై ఉండనీయకుండా లాఠీచార్జ్ చేశారు. రెండు పార్టీల కార్యకర్తల్ని చెరో వైపు చెల్లా చెదురు చేశారు. కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి ఈ సారి  ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చే్సతున్నారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఓ వైపు ఒంగోలులో ప్రచారం  చేస్తూ.. మరో వైపు కుమారుడి రాజకీయాన్ని కూడా చక్కదిద్దుతున్నారు. ఈ రోజు నామినేషన్ వేయించేందుకు స్వయంగా వచ్చారు. 

చావో రేవో అన్నట్లుగా పులివర్తి నాని రాజకీయం                                    

మరో వైపు టీడీపీ నేత పులివర్తి నాని చావో రేవో అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఆయన ఓ సారి దొంగ ఓట్ల వివాదంలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆయన భార్య సుధారెడ్డి కూడా చెవిరెడ్డిపై పోరాడుున్నారు. పేదల ఇళ్లు తొలగిస్తున్న సందర్భంలో ఆమె అడ్డుకోవడానికి వెళ్తే పోలీసులు లాగి పడేసిన ఘటనలో ఆమె కాలు విరిగింది. తీవ్రమైన వేధింపుల మధ్య తాము రాజకీయం చేస్తున్నామని పులివర్తి వర్గీయులు అంటున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురు పడితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. 

ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి             

ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సమస్యాత్మక నియోజకవర్గాల్లో చంద్రగిరి కూడా ఉంటుందని భావిస్తున్నారు. గత ఐదేళ్లుగా  రాజకీయాల్లో ప్రత్యర్థులు కన్నా.. వ్యక్తిగత శత్రువులు అన్నట్లుగా రెండు పార్టీలు మారిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget