అన్వేషించండి
Kavitha on Election Counting: మళ్లీ అధికారం మాదే - ఓట్ల కౌంటింగ్ సరళిపై స్పందించిన కవిత
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు.

కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha on Election Counting: ఓట్ల లెక్కింపు సరళిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తమకు మూడోసారి అధికారాన్ని అప్పగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏఎన్ఐతో మాట్లాడారు. తమకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కొనసాగుతుందని చెప్పారు. తాము చేసిన మంచి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తమను గెలిపిస్తారని చెప్పారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్





















