అన్వేషించండి

BJP MP Laxman: 'తొలి విడతలో బీసీలకు 20కు పైగా సీట్లు' - ఏ క్షణమైనా తొలి జాబితా ప్రకటన ఉంటుందన్న ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: బీజేపీ అధిష్ఠానం తెలంగాణ ఎన్నికల్లో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. 50కు పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తైందని చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని, తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశామని వివరించారు. దీంతో బండి సంజయ్, వివేక్, రఘునందన్ తో పాటు పలువురి కీలక నేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండొచ్చని స్పష్టమవుతోంది.  ముందుగా ప్రకటించినట్లుగానే ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

'బీసీలకు 20కి పైగా సీట్లు'

'ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశాం. తొలి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నాం. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది.' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం

బీసీలకు పెద్ద పీట వేస్తున్న పార్టీ బీజేపీనే అని, అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం అమలు చేస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోందన్నారు.

వారు బీసీలను పట్టించుకోలేదు

ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఈ 2 పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదని, వారిని బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. బీసీల సేవలను వాడుకొని వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్టీల కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీలకు కచ్చితంగా న్యాయం చేస్తామని అన్నారు.

'పోటీలో లేను'

తాను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ఐదేళ్లు ఉందని, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉందని, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా.? లేదా.? అనే దానిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రెండో జాబితా ఈ నెల 29 తర్వాత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, రాజాసింగ్  సస్పెన్షన్, ఎన్నికల్లో పోటీ అంశాన్ని సైతం అధిష్ఠానం పరిశీలిస్తోందని వెల్లడించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.

జనసేనతో పొత్తు?

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన తెలిపింది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో బీజేపీ చర్చలు జరపగా ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జనసేనతో సంప్రదింపులు జరపగా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని టికెట్లు జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఓటరు కార్డు లేదా? - అయినా ఓటెయ్యొచ్చు, ఎలా అంటే?

 

 

 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget