అన్వేషించండి

Voter Card: ఓటరు కార్డు లేదా? - అయినా ఓటెయ్యొచ్చు, ఎలా అంటే?

Voter Card: ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది.

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు రాజకీయ నేతల ప్రచారం ఊపందుకుంటే మరోవైపు ఎన్నికల అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డులోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని సీఈసీ ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలోని ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. అయితే, సదరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరుండాలని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేని, ఒక వేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కాని పక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలను తీసుకొస్తే ఓటు వేసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది.

ప్రత్యామ్నాయ పత్రాలివే

  • ఓటరు గుర్తింపు కార్డు లేని సమయంలో ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 
  • ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు/పోస్టల్ కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్ ను చూపించి ఓటెయ్యొచ్చు.
  • అలాగే, కేంద్ర కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు చూపించొచ్చు.
  • రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్ యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు.
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
  • కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ)

ఈ పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి

ఓటరు గుర్తింపు కార్డులో ఫోటోలు తారుమారు కావడం, ఇతర లోపాలున్నప్పుడు ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో నిర్దేశించిన ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని ఆధారంగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్ పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని సీఈసీ తెలిపింది. పోలింగ్ కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, టైం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే, ఇవి ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.

Also Read: Telangana Elections: ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత - ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా సీజ్

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget