అన్వేషించండి

Congress Joinings: రాథోడ్ బాపురావు బీజేపీకి గుడ్ బై - కాంగ్రెస్‌లో చేరిక

Telangana News : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

BJP leader and former MLA Rathore Bapurao joined Congress :  సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. మంత్రి సీతక్క అధ్వర్యంలో ఇటివలే సిర్పూర్ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే తరహాలో జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగింది. బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాజాగా సోమవారం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

గతంలో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన బాపురావ్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ తరువాత ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఎంపి టికెట్ సైతం గోడం నగేష్ కు కేటాయించడంతో బిజెపిలో ఎలాంటి ఆదరణ లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగడంతో పార్టీలో మంచి జోష్ కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపొందే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క చక్రం తిప్పుతున్నారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం సైలెంట్ గానే ఉన్నారు. సిర్పూర్ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరిక తర్వాత ఆయన జానారెడ్డి తో చర్చలు జరిపి పార్టీలో చేరేందుకు సిద్ధంకాగా.. నిర్మల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావ్ తన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటినుండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికకు గ్యాప్ వచ్చింది. 

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్(టి) నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకోగా.. బిఆర్ఎస్ 2స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని డి కొట్టడానికి, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు చేపడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి లు సైతం నేడో రేపు  కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Vijayawada Highway: సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
Makar Sankranti 2025 : భోగి మంట హోమంతో సమానం.. ట్రెండీగా కాదు ట్రెడిషనల్ గా వెలిగించండి!
భోగి మంట హోమంతో సమానం.. ట్రెండీగా కాదు ట్రెడిషనల్ గా వెలిగించండి!
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
Embed widget