అన్వేషించండి

Kadapa News: బీజేపీ బానిస జగన్‌- వైఎస్‌ వారసుడు ఎలా అవుతారు? బస్‌ యాత్రలో షర్మిల ఘాటు వ్యాాఖ్యలు

Sharmila VSJagan: కడప జిల్లా వేదికగా జగన్ వర్సెస్‌ షర్మిల ఫైట్‌ చాలా ఆసక్తిగా సాగుతోంది. అన్నపై ఒంటికాలిపై లేచి విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఇన్నాళ్లు సాఫ్ట్‌గా డీల్ చేసిన ఆమె స్వరాన్ని పెంచారు.

Andhra Pradesh News: కడప జిల్లాలో జగన్‌, అవినాష్ రెడ్డి టార్గెట్‌గానే ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల బస్‌ యాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండేవాళ్లను గుర్తుచేశారు. అలాంటి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

బస్‌ యాత్రలో షర్మిల ఇంకా ఏమన్నారంటే..."బీజేపీకి వైఎస్సార్ ఎప్పుడు వ్యతిరేకే. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా ఉన్నారు. అందుకే ముస్లీంలకు జగన్ సమాధానం చెప్పాలి. మణిపూర్‌లో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదు.- బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు. జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశారు. ఇమామ్‌లకు 15 వేలు వేతనం అన్నారు. ముస్లీం బ్యాంక్ అన్నారు. చనిపోతే 5 లక్షల బీమా అన్నారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మరిచారు." అలాంటి వ్యక్తికి ఇప్పుడు బుద్ది చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు. 

ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు షర్మిల. బాబు, జగన్ ఇద్దరు ముస్లీంల పక్షాన లేరని తేల్చేసారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని వీళ్ళు బానిసలు అయ్యారని ప్రశ్నించారు. "విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదు. హోదాపై బీజేపీ మోసం చేసింది., వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది.కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారు. మూడు సార్లు శంకుస్థాపన చేశారు. ఎంపిలు నిద్ర పోతున్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదు. కడప - బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం. కడప లైన్‌ను జగన్ వద్దన్నారట." అని విమర్శించారు. 

నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద సీబీఐ ముద్ర వేసిందన్న షర్మిల... నిందితుడిగా ఉన్న వ్యక్తికి మళ్ళీ ఎలా టిక్కెట్ ఇచ్చారని జగన్‌ను ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. "బాబాయి హత్య కేసులో జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు. ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారు? CBI విచారణ ఎందుకు వద్దన్నారు? మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు ? నిందితులను ఎందుకు కాపాడుతున్నారు?" వీటికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. 

హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలని కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నిందితుడు అని సీబీఐ చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే తాను పోటీలోకి దిగాల్సి వచ్చిందన్నారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానన్న షర్మిల... వైఎస్సార్ లెక్క సేవ చేస్తాని హామీ ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget