Lok Sabha Election 2024 LIVE Updates: ఏపీలో రిజల్ట్ ఆలస్యమయ్యే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఇవే
Lok Sabha Election 2024 LIVE: దేశ వ్యాప్తంగా జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటిగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి విజేతల్ని ఈసీ ప్రకటించనుంది.
LIVE

Background
Security surveillance with drones: కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా
కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్! ఫలితాలు ఎలా వస్తాయో
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 9 సీట్లు నెగ్గుతుందని, బీజేపీ 7 నుంచి 9 స్థానాల్లో గెలవగా, ఇతరులు ఒక సీటు నెగ్గుతారని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ లో తేలింది.
Lok Sabha Election 2024 LIVE Updates: ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: సీఈసీ రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో జరిగిన ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. ఈ ఓటర్ల సంఖ్య G7 కూటమి దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన వివరించారు.
Lok Sabha Election 2024 LIVE Updates: ఏపీలో భీమిలి, పాణ్యంలలో అత్యధిక రౌండ్లు - త్వరగా ఫలితం తేలిది ఎక్కడంటే
ఏపీలో అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే 1) భీమిలి, పాణ్యంలలో అత్యధికంగా 26 రౌండ్స్‌లో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు దాదాపు 9 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. అత్యల్పంగా కొవ్వూరు, నరసాపురంలో అత్యల్పంగా 13 రౌండ్స్ జరుగుతుంది. దాదాపు 5 గంటలపాటు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
Lok Sabha Election 2024 LIVE Updates: ఏపీలో అమలాపురంలో అత్యధిక రౌండ్లలో కౌంటింగ్
ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో చూస్తే నరసాపురం, రాజమండ్రిలలో కేవలం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. దాదాపు 5 నుంచి 6 గంటల్లో కౌంటింగ్ పూర్తి కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

