అన్వేషించండి

బీజేపీతో పొత్తు.. ఈ నెల 9న ఎన్‌డీఏ గూటికి టీడీపీ ?

TDP joins NDA on 9th of this month : ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరనున్నట్లుగా తెలుస్తోంది.

Alliance With BJP.. TDP Joins Nda On 9th Of This Month : ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందినట్టు చెబుతున్నారు. గత నెలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పొత్తు చర్చల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయని, ఒకటి, రెండు రోజుల్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరుతుందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వచ్చారు. కానీ, బీజేపీ కూటమిలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేరలేదు. ఆ తరువాత ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా సాగలేదు. మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వెళతారని, పవన్‌ కల్యాణ్‌ వెళ్లి మాట్లాడారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు వచ్చాయి. పొత్తు మరి లేదంటూ కొన్ని వర్గాలు ప్రచారమూ చేశాయి. ఈ క్రమంలోనే పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఈ నెల తొమ్మిదో తేదీన టీడీపీ, జనసేన పార్టీలు ఎన్‌డీఏ కూటమిలో చేరుతాయని చెబుతున్నారు.

రాష్ట్ర నేతలతో బీజేపీ అగ్ర నేతల భేటీ

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తులు, ఇతర అంశాలపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.    వీరితో గురు, శుక్రవారాల్లో అమిత్‌ షా, జేపీ నడ్డా సమావేశమై తుది నిర్ణయం దిశగా చర్యలు తీసుకోనున్నారు.  పొత్తు లేకపోయినా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నదీ, లేనిదీ ఈ సమావేశంలో అగ్రనేతలు తెలుసుకోనున్నారు.

పొత్తుకే బీజేపీ నాయకత్వం మొగ్గు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ, రాష్ట్రం నుంచి బీజేపీ సింబల్‌పై గెలిచే కొన్ని స్థానాలను అగ్రనాయకత్వం కోరుకుంటోందని తెలుస్తోంది.   వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు బీజేపతో పొత్తుకు సిద్ధంగా లేదు.  బయట  నుంచి మాత్రం సహకారాన్ని ఎల్లప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉంటోంది. ఇదే ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వాన్ని పొత్తు వైపు వెళ్లేలా చేస్తోందని అంటున్నారు.  పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తీసుకుని రాష్ట్రంలో ప్రాతినిధ్యం సంపాదించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పొత్తుకు అగ్రనాయకత్వం సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.

5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కోరుతున్న బీజేపీ          

పొత్తులో భాగంగా ఐదు ఎంపీ, తొమ్మిది నుంచి పది ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కోరే అవకాశముంది. ఎంపీ స్థానాల్లో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు ఉన్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో గుంటూరు వెస్ట్‌, విశాఖ నార్త్‌, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, శ్రీకాళహిస్తతోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో సీటు కోరే అవకాశముందని చెబుతున్నారు. ఇంకా, బలమైన నేతలు ఉంటే రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకు ఆయా స్థానాలను కోరే చాన్స్‌ ఉందని, దాదాపు పొత్తు పూర్తయినట్టేనని చెబుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget