అన్వేషించండి

Seven Musical Notes: సప్తస్వరాలు ఎలా వచ్చాయి? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

Seven Musical Notes: భారతీయ శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు పట్టుగొమ్మల్లాంటివి. ఇంతకీ అవి ఎలా వచ్చాయి.

Seven Musical Notes: భారతీయ శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు పట్టుగొమ్మల్లాంటివి. ఇవి పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి ఉద్భవించాయి. స, రి, గ, మ, ప, ద, ని వీటిని సప్తస్వరాలు అంటారు.

స అంటే షడ్జమం. ఇది నెమలి క్రేంకారం నుంచి పుట్టింది.

రి అంటే రిషభం ఇది ఎద్దు రంకె నుంచి పుట్టింది.

గ అంటే గాంధర్వం ఇది మేక అరుపు నుంచి పుట్టింది.

మ అంటే మధ్యమం ఇది క్రౌంచ పక్షి కూత నుంచి పుట్టింది

ప అంటే పంచమం ఇది కోయిల కూత నుంచి పుట్టింది

ద అంటే ధైవతం ఇది గుర్రం సకిలింత నుంచి పుట్టింది

ని అంటే నిషాదం ఇది ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది.

సాధారణంగా ఒక రాగంలో ఐదు స్వరాలు ఉంటాయి. ఈ రాగాల కూర్పు వల్లనే భారతీయ సంగీతం ప్రపంచ సంగీతంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. స్వరాలకు ఆధారం శృతులు. శృతి అంటే ధ్వని విశేషం. సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీటికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. ఇది భారతీయ శాస్త్రీయ సంగీతానికున్న ప్రత్యేకత.

స, రి, గ, మ, ప, ద, ని సప్త స్వరాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో పాడుతారు. అంటే..తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అంటే.. మధ్యమ స్థాయి షడ్జం నుంచి తారా స్థాయి షడ్జం వరకు పాడటం. ఉదాహరణకు స రిగా మ ప దని స..ఇలాగన్నమాట.

Seven Musical Notes: సప్తస్వరాలు ఎలా వచ్చాయి? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అంటే తారా స్థాయి షడ్జం నుంచి మధ్యమ స్థాయి షడ్జం వరకు పాడటం. ఉదాహరణకు సని ద ప మగా రి స..ఇలాగన్నమాట.

శాస్త్రీయ సంగీతంలో సప్తస్వరాలను కోమల స్వరాలుగా పిలుస్తారు. అయితే వీటితో పాటూ తీవ్ర స్వరాలు కూడా ఉంటాయి. వీటిని వికృత స్వరాలు అని పిలుస్తారు. ఈ రెండూ కలిపి మొత్తం పన్నెండు స్వరాలు. వీటిలో 7 శుద్ధ స్వరాలుగా, 5 వికృత స్వరాలుగా విభజించారు.

Seven Musical Notes: సప్తస్వరాలు ఎలా వచ్చాయి? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

భారతీయ సంప్రదాయంలోని అన్ని కళల్లాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల పక్షుల స్వరాలను నిశితంగా పరిశీలించటం వల్ల వాటి కూతలను అనుకరించటం వల్ల స్వరాలు ఏర్పడ్డాయని హిందూ శాస్త్రీయ గ్రంథాలు చెప్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరించే కొన్ని సంగీత స్వరాల నుంచి భారతీయ సంగీతం ఉద్భవించిందని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పుకొచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Virat Kohli Records: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
Embed widget