అన్వేషించండి

TSRJC CET 2021: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణ కుమార్‌ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ (TSRJC) సెట్‌ పరీక్ష తేదీ ఖరారైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ పరీక్షను ఆగస్టు 14వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌.రమణ కుమార్‌ వెల్లడించారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షను 14న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ https://tsrjdc.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కోవిడ్ నిబంధనలతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు రమణ కుమార్‌ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ తొలి ఏడాదిలో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీని ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ సహా పలు విభాగాల్లో చేరవచ్చు. 
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ఆగస్టు 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 21న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్లకు గానూ అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 
దోస్త్ గడువు 28 వరకు పెంపు.. 
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ) పరీక్ష మొదటి విడత రిజిస్ట్రేషన్‌ గడువును మరోసారి పొడిగించారు. జూలై 28 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని చెప్పారు. ఆగస్టు 4వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. రెండో విడత సీట్లను ఆగస్టు 25వ తేదీన కేటాయిస్తామని పేర్కొన్నారు. 
దోస్త్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ ఒకేషనల్, బీకామ్ ఆనర్స్, బీఎస్ డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/  లేదా మీసేవ సెంటర్ లేదా టీ యాప్ ఫోలియా మొబైల్ యాప్ (T App Folio Mobile App) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Embed widget