అన్వేషించండి

Inter Supplementary Exam Fee: మే 2తో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు, పరీక్షల షెడ్యూలు ఇదే

Inter Supplemetary Exams: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మే 2తో ముగియనుంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.

TS Inter Supplemetary Exam Fee: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మే 2తో ముగియనుంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులకు కళాశాలలో ఫీజు చెల్లించేందుకు మే 2 వరకు, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు మే 3 వరకు గడువు విధించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. 

➥ విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ఇంటర్ ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టిక‌ల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి పరీక్ష నిర్వహిస్తారు. 

➥ ఇక జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పరీక్షలు జరుగనున్నాయి. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-1.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1ఎ, బోట‌ని పేప‌ర్-1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-1.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1బి, జువాల‌జీ పేప‌ర్-1, హిస్టరీ పేప‌ర్-1.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-1, ఎకాన‌మిక్స్ పేప‌ర్-1.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-1, కామ‌ర్స్ పేప‌ర్-1.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, జియోగ్రఫీ పేప‌ర్-1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-2.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-2.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2ఎ, బోట‌ని పేప‌ర్-2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-2.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2బి, జువాల‌జీ పేప‌ర్-2, హిస్టరీ పేప‌ర్-2.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-2, ఎకాన‌మిక్స్ పేప‌ర్-2.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-2, కామ‌ర్స్ పేప‌ర్-2.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, జియోగ్రఫీ పేప‌ర్-2.

VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024

VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget