News
News
X

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈ ఉదయం విడుదల చేయనున్నారు.

FOLLOW US: 

తెలంగాణలో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ రానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ప్రాంగణంలో ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. సీడీలో ఫలితాలు ఉంచిన అధికారులు దాన్ని మంత్రితో విడుదల చేయిస్తారు. అనంతరం పాస్‌ వర్డ్ కూడా విడుదల చేయిస్తారు. అనంతరం ఫలితాలను ఏబీపీ దేశం వెబ్‌సైట్‌(telugu.abplive.com), bse.telangana.gov.inలో చూసుకోవచ్చు.  

జూన్‌ మొదటి వారంలో ముగిసిన పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో 2021-22 సంవత్సరానికి చెందిన పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 న చివరి పరీక్ష జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించారు. 

కరోనా కారణంగా చాలా మార్పులు 
తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. గతేడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే రెండేళ్లు నేరుగా విద్యార్థులను తరువాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు.

ముందు చెప్పినట్టుగానే 
ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మొదట్లోనే అధికారులు ప్రకటించారు. 

తెలంగాణ SSC రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఫలితాలు ఎలా చూడాలి
ఏబీపీ దేశం వెబ్‌సైట్‌ telugu.abplive.comలోకి లేదా bse.telangana.gov.in వెళ్లాలి.
టాప్‌లో TS SSC Results 2022 కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి. లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా వెబ్‌సైట్‌నైనా క్లిక్ చేయాలి. 
అలా క్లిక్‌ చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీకు రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ పరీక్ష రిజిస్టర్ నెంబర్ టైప్ చేయాలి. 
తర్వాత రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి. 
వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
అందులో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫలితాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. 
తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని మీ వద్దే ఉంచండి.

Published at : 30 Jun 2022 12:07 AM (IST) Tags: TS SSC Exams Results TS SSC Exams Results 2022 Tenth Exams Results Telangana SSC Results Telangana SSC Results 2022 Tenth Exams Results Today Tenth Exams Results 2022 Today

సంబంధిత కథనాలు

NEET 2022 Result: నేడు నీట్‌ ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

NEET 2022 Result: నేడు నీట్‌ ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

BRAOU: భారమైన 'దూరవిద్య' - అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు డబుల్!

BRAOU: భారమైన 'దూరవిద్య' - అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు డబుల్!

Medical PG counselling: పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచంటే?

Medical PG counselling: పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచంటే?

TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్‌ సర్టిఫికేట్ వెరిఫికేషన్!

TS DEECET: ఆగస్టు 22 నుంచి డీఈఈసెట్‌ సర్టిఫికేట్ వెరిఫికేషన్!

RGUKT: ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

RGUKT:  ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!