TS SSC Results 2022 Live Updates: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌లో భారీగా ఉత్తీర్ణత శాతం, ఇక్కడ ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ చెక్ చేస్కోండి
Telangana SSC Results నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేస్తారు. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీ ఫాలో అవండి.
LIVE

Background
Tenth Exams Results Pass Percentage: పది ఫలితాల్లో ఈ జిల్లానే టాప్
- తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల
- ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలికలు 92.45 శాతం , 87.61 శాతం పాస్
- బాలికలు, బాలుర కంటే 4.84 శాతం అధికంగా ఉత్తీర్ణత
- పదవ తరగతి ఫలితాల్లో రికార్డ్ స్థాయిలో ఉత్తీర్ణత
- 90 శాతం పాస్ అయిన విద్యార్థులు
- సిద్దిపేట జిల్లా 97.85 శాతంతో మొదటి స్థానంలో, 79.63 శాతం తో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉన్నాయి
- ఆగస్ట్ ఒకటి నుంచి పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు
- 01.08.22 నుంచి 10.08.22 వరకు జరగనున్న అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు
Telangana SSC Results: ఆగస్టులో సప్లిమెంటరీ పరీక్షలు
పది పరీక్షల్లో సరైన మార్కులు రాని వారి కోసం రీవెరిఫికేషన్ సౌకర్యం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రీవెరిఫికేషన్ జిరాక్స్ కూడా ఇవ్వడం కుదురుతుందని అన్నారు. ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టులోనే నిర్వహిస్తామని వెల్లడించారు.
Tenth Exam Results: పదో తరగతిలోనూ బాలికలే టాప్
పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో అబ్బాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తం కలిపి 90శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
Sabitha Indra reddy: ఈ ఏడాది పదో తరగతి పాసైన వారి సంఖ్య ఇదే
ఈ ఏడాది 5,03,579 విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 4,53,201 మంది పాసైనట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో అబ్బాయిలు 2,55,433 మంది హాజరు కాగా.. 2,23,779 పాసయ్యారని వివరించారు. అమ్మాయిల్లో 2,48,146 మంది పరీక్షలు రాయగా, 2,29,422 మంది పాసైనట్లుగా వెల్లడించారు.
Tenth Exams Results Release: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు (జూన్ 30) ఉదయం 11.30 గంటలకు పది పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

