అన్వేషించండి

TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు, రిజల్ట్స్ సమయమిదే

PGECET 2024 Results: తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు నేడు (జూన్ 18) విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఇతర అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana PGECET 2024 Results: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 18న వెల్లడించనున్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ-హైదరాబాద్ హెచ్‌గోల్డెన్‌ జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అడ్మిషన్ భవనంలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఇతర అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.

TG PGECET-2024 ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...

➥ పీజీఈసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://pgecet.tsche.ac.in/

➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.

➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ వివరాలు నమోదుచేయగానే ఐసెట్ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.

➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఫలితాల కోసం వెబ్‌సైట్..

పీజీఈసెట్ పరీక్షలను హైదరాబాద్, వరంగల్‌లోని పలు కేంద్రాల్లో జూన్ 10 నుంచి జూన్ 13 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో అమ్మాయిలు 12,532 మంది, అబ్బాయిలు 10,180 మంది ఉన్నారు. విభాగాలవారీగా ఫార్మసీకి 7,376 మంది, కంప్యూటర్‌ సైన్స్‌-ఐటీ విభాగానికి 4,903 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 20,626 (90.82%) మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 18న విడుదల చేయనున్నారు. 

'TS PGECET-2024' నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ మార్చి 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థుల ద్వారా మార్చి 16 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇక ఆల‌స్య రుసుముతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీకరించింది. మే 28న హాల్‌టికెట్లు విడుదల చేసి.. జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించింది.

ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించారంటే..?

పరీక్ష తేదీ పరీక్ష పేపరు
జూన్ 10 జియో ఇంజినీరింగ్ అండ్ జియోఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్
జూన్ 11 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ
జూన్ 12 ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జిక్ ఇంజినీరింగ్
జూన్ 13 ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, నానోటెక్నాలజీ

అర్హత మార్కులు..
టీజీ పీజీఈసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో నిర్వహించారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget