అన్వేషించండి

TS LAWCET Counselling: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, పూర్తి షెడ్యూలు ఇలా!

అభ్యర్థులకు న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించ‌నున్నారు. సీట్లు పొందినవారు నవంబరు 23 నుంచి 26 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నవంబరు 1న వెబ్‌కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రవపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 14 నుంచి 16 వరకు స్పెషల్ కేటగిరీ(ఎన్‌సీసీ/ క్యాప్ / పీహెచ్ / స్పోర్ట్స్) అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 17న రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

జాబితాకు ఎంపికైన అభ్యర్థులు నవంబరు 18, 19 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాలి. నవంబరు 20న వెబ్‌ ఆప్షన్లలో సవరణకు అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించ‌నున్నారు. సీట్లు పొందినవారు నవంబరు 23 నుంచి 26 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. 

కౌన్సెలింగ్ నోటిఫికేషన్ 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

కౌన్సెలింగ్ షెడ్యూలు...

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: నవంబరు 1న.

➥ ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన, సర్టిఫికేట్ల అప్‌లోడ్ & వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు: న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు.

➥ స్పెషల్ కేటగిరీ  (ఎన్‌సీసీ/ క్యాప్ / పీహెచ్ / స్పోర్ట్స్) అభ్యర్థులకు స్లాట్ బుకింగ్: నవంబరు 14 నుంచి 16 వరకు.

➥ అభ్యర్థుల జాబితా ప్రకటన: నవంబరు 17న

➥ లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు న‌మోదు: న‌వంబ‌ర్ 18, 19 తేదీల్లో 

➥ వెబ్‌ ఆప్షన్ల సవరణ: నవంబరు 20న

➥ సీట్ల కేటాయింపు: న‌వంబ‌ర్ 22న.

➥ కళాశాలలో రిపోర్టింగ్:  నవంబరు 23 నుంచి 26 వరకు

➥ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభం: నవంబరు 28 నుంచి. 

 

కౌన్సెలింగ్ సాగేదిలా...

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

➥ నిర్ణీత కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.

➥ రిజిస్ట్రేషన్ సమయంలోనే అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికేట్ (డాక్యుమెంట్స్) కాపీలను అప్‌లోడ్ చేయాలి.

➥ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారానే సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు.

➥ ధ్రువపత్రాల పరిశీలన పూర్తియివారు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

➥ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు తర్వాతి దశలో సీట్లను కేటాయిస్తారు.

➥ సీట్లు పొందినవారు ఫీజు చెల్లింపు చలనా, జాయినింగ్ రిపోర్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

➥ అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాలలో నిర్ణీత వ్యవధిలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

➥ సంబంధిత కళాశాలలో అభర్థులకు మరోసారి ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.

➥ సీట్ల కేటాయింపుకు సంబంధించిన అలాంట్‌మెంట్ ఆర్డన్‌ను తీసుకోవాలి.

➥ అనంతరం తరగతుల ప్రారంభం

➥ తొలివిడతలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు జులై 21, 22 తేదీలలో లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించగా, ఆగస్టు 17వ తేదీన లాసెట్ ఫలితాలను ప్రకటించారు. మూడేళ్ల లా కోర్సుకు 15,031 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా,ఐదేళ్ల కోర్సుకు 4,256 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే పీజీఎల్‌సెట్‌కు 2,375 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు యూనివర్సిటీలో 26 న్యాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 12 బ్రాంచులున్నాయి.


Also Read:

'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget