అన్వేషించండి

తెలంగాణ ఈసెట్ - 2024 షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

TS ECET 2024 Schedule: బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.  మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్ ఈసెట్ షెడ్యూలు..

➥ ఈసెట్ నోటిఫికేషన్‌ విడుదల: ఫిబ్రవరి 14  

➥ ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌రణ: ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు 

➥ ఆల‌స్యం రుసుంతో ద‌ర‌ఖాస్తుకు అవకాశం: ఏప్రిల్ 28 వరకు 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ 24 నుంచి 28 వరకు 

➥ ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహణ: మే 6న. 

లాసెట్ షెడ్యూల్ విడుద‌ల‌..
తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు. తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు సమర్పించవచ్చు.

లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలు ఇలా..

➥ టీఎస్ లాసెట్/ టీఎస్‌పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్: 28.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023.

➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25-05-2024.

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.

ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ టీఎస్ ఈఏపీసెట్ నోటిఫికేషన్  ఫిబ్రవరి 21న వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. 

➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జ‌ర‌గ‌నుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించ‌నుంది. 

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఐసెట్' ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. 

➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ పీఈసెట్' ప‌రీక్షను జూన్ 10 నుంచి 13 మ‌ధ్య నిర్వహించ‌నున్నారు. శాతవాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget