అన్వేషించండి

TS EAPCET Results: టీఎస్ ఎప్‌సెట్ - 2024 ఫలితాల్లో టాపర్లు బాలురే, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి

TS EAPCET 2024 ఫలితాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66% అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 74.98% అర్హత సాధించారు. ఫలితాల్లో బాలురు టాపర్లుగా నిలవగా.. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయి సాధించారు.

TS EAPCET 2024 Toppers: టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ముఖ్య కార్యద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుద‌ల చేశారు. ఫలితాల వెల్లడి సందర్భంగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. గతేడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించామని, ఈసారి ఎంసెట్ పేరును మార్చి ఎప్‌సెట్‌ను మొదటి సారిగా నిర్వహించామని తెలిపారు. అగ్రిక‌ల్చర్, ఫార్మసీ ప‌రీక్షల‌కు 1,00,432 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 91,633 మంది 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ విభాగానికి 2,54750 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,40,618 మంది 94.45 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. ఈఎపీసెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఈసారి ఒక్కో షిఫ్ట్‌లో 50వేల మంది పరీక్ష రాసినట్లు ఆయన వెల్లడించారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదల చేస్తానమని లింబాద్రి తెలిపారు.

TS EAPCET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

అర్హతలో బాలికలదే పైచేయి, సత్తాచాటిక ఏపీ విద్యార్థులు..
ఎప్‌సెట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. అయితే టాప్-10లో ఒకే అమ్మాయి 10 ర్యాంకులో నిలిచింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 90.18 శాతం, బాలురు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.85 శాతం, బాలురు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ ప‌రీక్షల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఎంసెట్‌ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం.

టాపర్లు బాలురే.. 

ఇంజినీరింగ్‌లో టాప‌ర్లు వీరే..

పేరు ప్రాంతం సాధించిన ర్యాంకు
స‌తివాడ జ్యోతిరాధిత్య  శ్రీకాకుళం 1వ ర్యాంకు
గొల్లలేఖ హ‌ర్ష  క‌ర్నూల్ 2వ ర్యాంకు
రిషి శేఖ‌ర్ శుక్లా  సికింద్రాబాద్ 3వ ర్యాంకు
భోగ‌ల‌ప‌ల్లి సందేశ్  మాదాపూర్, హైద‌రాబాద్ 4వ ర్యాంకు
ముర‌సాని సాయి య‌శ్వంత్ రెడ్డి  క‌ర్నూల్ 5వ ర్యాంకు
పుట్టి కుశాల్ కుమార్ అనంత‌పూర్ 6వ ర్యాంకు
హుందేక‌ర్ విదిత్  రంగారెడ్డి 7వ ర్యాంకు
రోహ‌న్ సాయి ప‌బ్బ  ఎల్లారెడ్డిగూడ‌, హైద‌రాబాద్ 8వ ర్యాంకు
కొణ‌తం మ‌ణితేజ  వ‌రంగ‌ల్ 9వ ర్యాంకు
ధ‌నుకొండ శ్రీనిధి  విజ‌య‌న‌గ‌రం 10వ ర్యాంకు

అగ్రిక‌ల్చర్, ఫార్మసీలో టాప‌ర్లు వీరే..

పేరు ప్రాంతం సాధించిన ర్యాంకు
ఆలూరు ప్రణీత  అన్న‌మ‌య్య జిల్లా, ఏపీ 1వ ర్యాంకు
న‌గుదశారి రాధాకృష్ణ  విజ‌య‌న‌గ‌రం, ఏపీ 2వ ర్యాంకు
గ‌డ్డం శ్రీ వ‌ర్ష‌ణి  వ‌రంగ‌ల్ 3వ ర్యాంకు
సోమ్‌ప‌ల్లి సాకేత్ రాఘ‌వ్ చిత్తూరు, ఏపీ 4వ ర్యాంకు
రేపాల సాయి వివేక్ గోల్కొండ‌, హైద‌రాబాద్ 5వ ర్యాంకు
మ‌హ్మ‌ద్ అజాన్ సాద్  మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి 6వ ర్యాంకు
వ‌డ్ల‌పూడి ముఖేశ్ చౌద‌రి  తిరుప‌తి, ఏపీ 7వ ర్యాంకు
జెన్ని భార్గ‌వ్ సుమంత్  కుత్బుల్లాపూర్, హైద‌రాబాద్ 8వ ర్యాంకు
జ‌య‌శెట్టి ఆదిత్య  కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాద్ 9వ ర్యాంకు
పూల దివ్య తేజ  శ్రీ స‌త్య‌సాయి జిల్లా, ఏపీ 10వ ర్యాంకు

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget