అన్వేషించండి

AP EAPCET - 2024: ఏపీ ఎప్‌సెట్ బైపీసీ స్ట్రీమ్ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

Andhra Pradesh: ఏపీ ఎప్‌సెట్‌కు సంబంధించి అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేశారు.

TS EAPCET 2024 BiPC Stream Answer key: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 25న ఉదయం 10 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు.

Website

మే 24న ఇంజినీరింగ్ ఆన్సర్ కీ..
ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను మే 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంజినీరింగ్‌ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. 

ఎప్‌సెట్ పరీక్షలకు 93.47 శాతం అభ్యర్థులు హాజరు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 16న ప్రారంభమైన AP EAPCET -2024 పరీక్షలు మే 23తో ముగిశాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్‌ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం రెండు విభాగాలకు కలిపిం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరు నమోదైంది. ఇక విభాగాలవారీగా పరిశీలిస్తే.. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్ మార్కులకు వెయిటేజీ వర్తింపు..
ఏపీ ఎప్‌సెట్‌-2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇతర బోర్డులకు సంబంధించిన విద్యార్థులు తమ ఇంటర్‌ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే పరిష్కరించేందుకు ఫోన్‌ నెంబర్లు: 0884-2359599, 2342499 అందుబాటులో ఉంచారు. వీటిద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 

పరీక్ష విధానం..
ఏపీఎప్‌సెట్-2024 పరీక్షను మొత్తం 160 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ ఛాయిస్) విధానంలో ప్రశ్నులు అడగుతారు. ఒక్కోప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

➥ బీఎస్సీ (నర్సింగ్).

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Unstoppable 4 Latest Promo: మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Unstoppable 4 Latest Promo: మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
Prayagraj Mahakumbh 2025 : రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Embed widget