అన్వేషించండి

TG POLYCET 2024 Results: నేడే తెలంగాణ పాలిసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ సమయమిదే

TG POLYCET 2024: తెలంగాణలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'పాలిసెట్' ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 3న వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana Polycet 2024 Results: తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'TS POLYCET 2024' ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు (జూన్ 3) విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 92,808 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 82,809 (89.23శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు.

పాలిసెట్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ (LINK 1)

పాలిసెట్ ఫలితాల కోసం  వెబ్‌సైట్ (LINK 2)

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
TS POLYCET 2024 Counselling Schedule: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును జూన్ 10 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20 నుంచి పాలిసెట్  కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి జూన్ 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జూన్ 22 నుంచి 27 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసివారికి జూన్ 30న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జూన్ 30 నుంచి జులై 4 మధ్య సంబంధిత కళాశాలల్లో నిర్ణీత ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేకపోయినవారు, కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారికి జులై 7 నుంచి 16 మధ్య రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీరికి జులై 9 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్‌ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించనున్నారు. జులై 24లోపు సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.  

పాలిసెట్ తొలి విడత కౌన్సెలింగ్ తేదీలు..

➥ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం: 20.06.2024.

➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 22.06.2024 - 25.06.2024 వరకు.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 22.06.2024 - 27.06.2024 వరకు.

➥ పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు: 30.06.2024 లోపు.

➥ సెల్ఫ్ రిపోర్టింగ్: 30.06.2024 నుంచి 04.06.2024 మధ్య.

పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు..

➥ పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం: 07.07.2024.

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 09.07.2024 నుంచి.

➥ పాలిసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు: 13.07.2024.

➥ ఇంటర్నల్ స్లైడింగ్‌: 21.07.2024.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget