అన్వేషించండి

TSCHE Website: 27 భాషల్లో ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీచర్ కూడా!!

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) వెబ్‌సైట్‌ను 27 దేశ, విదేశీ భాషల్లో అందుబాటులోకి తెచ్చామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) వెబ్‌సైట్‌ను 27 దేశ, విదేశీ భాషల్లో అందుబాటులోకి తెచ్చామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు, మౌలిక వసతుల విభాగం సంచాలకుడు పి.నవీన్ కుమార్ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. భాషల్లో ఉంటుందని చెప్పారు. ట్విన్నింగ్‌, జాయింట్‌ డిగ్రీల కోసం మన దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఈ వెబ్‌సైట్‌ ఉపయుక్తంగా ఉంటుందని వెబ్‌ డిజైన్‌ రూపకర్తల్లో ఒకరైన ప్రొఫెసర్‌ పీ నవీన్‌కుమార్‌ తెలిపారు.

ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఉన్నత విద్యను అభ్యసించేందుకు మన రాష్ర్టానికి వచ్చే విదేశీ, దేశంలోని ఇతర రాష్ర్టాల విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తన అధికారిక వెబ్‌సైట్‌‌ను అధునాతనంగా తీర్చిదిద్దింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నవంబరు 18న ఆవిష్కరించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, వసతులు తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని 18 విదేశీ, 9 స్వదేశీ భాషల్లో పొందుపరిచారు. 

స్వదేశీ భాషలు: తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, తమిళం, సంస్కృతం, మరాఠి, కన్నడ, గుజరాతీ.

విదేశీ భాషలు: ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, ఇండోనేషియన్‌, డచ్‌, అరబిక్‌, చైనీస్‌, రష్యన్‌, ఐరిష్‌, పర్షియన్‌, నేపాలీ, మంగోలియన్‌, థాయ్‌, లాటిన్‌, జపనీస్‌, ఇటాలియన్‌, హంగేరియన్‌. 

వెబ్‌‌సైట్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీచర్ కూడా... 
27 బాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించడమే కాకుండా.. నకిలీ సర్టిఫికేట్లను తక్షణమే కనిపెట్టే Student Academic Verification Service పేరుతో సాంకేతికపరమైన సర్వీసును ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ‘ఆధార్, ఈమెయిల్‌ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్‌ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్‌ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్‌ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్‌ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్‌ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని అన్నారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్‌ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీచర్ లింక్ కోసం క్లిక్ చేయండి..

Also Read:

డిజిటలైజేషన్‌ బాటలో ఉస్మానియా వర్సిటీ!
ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా మరో కీలక ముందడుగు వేసింది. పరీక్షల విభాగం ఆటోమేషన్ చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దశాబ్దాలుగా ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ధ్రువపత్రాన్ని పరిశీలించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. 1930కి చెందిన రికార్డు కావడంతో సేకరించడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు అప్పటి ధ్రువపత్రాలన్నీ ఉర్దూలో ఉన్నాయి. ఎట్టకేలకు వెతికి పట్టుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయ రికార్డులన్నీ పరీక్షల విభాగంలో జాగ్రత్తగా పొందుపరిచారు. లక్షల సంఖ్యలో ఉన్న రికార్డుల్లో.. అవసరమైన పత్రాలను భౌతికంగా వెతికి తీసుకోవడం కష్టమవుతోంది. ఇప్పటివరకు ఓయూ పరీక్షల విభాగంలో 2009 తర్వాత రికార్డులు, ధ్రువపత్రాలే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మిగతావీ కంప్యూటరీకరించేందుకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే డిగ్రీ, పీజీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. ఏటా వర్సిటీ పరిధిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంలో భాగంగా జవాబు పత్రాలన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులకు పంపించి దిద్దిస్తున్నారు. ఏ జవాబుపత్రం ఎవరు దిద్దుతున్నారో బయటకు తెలియదు. ధ్రువపత్రాలు పొందేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఓయూ తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని విభాగాలకే పరిమితమైంది.త్వరలో పూర్తిస్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతున్నారు. ధ్రువపత్రాల జారీ నుంచి, పాత రికార్డులన్నీ జూన్ కల్లా డిజిటలైజ్ కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.బి.నగేశ్ తెలిపారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలన్నది లక్ష్యం.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget