అన్వేషించండి

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు 11,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,053 మంది( 35.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Telangana Open School SSC, Inter Results: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(TOSS) పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు 11,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,053 మంది( 35.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్మీడియట్‌లో 15,348కి గాను 8,191 మంది (53.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మార్కుల మెమోలను సంబంధిత స్టడీ సెంటర్లకు 15 రోజుల్లో పంపించనున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ కోసం డిసెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

TOSS SSC RESULTS OCTOBER - 2023

TOSS INTER RESULTS OCTOBER - 2023 

స్పెషల్ ప్రవేశాల గడువు పొడిగింపు..

ఓపెన్‌ స్కూల్‌లో స్పెషల్‌ అడ్మిషన్లకు డిసెంబ‌ర్ 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈ ఓ అబ్దుల్‌హై, ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డి నేటర్‌ మురాళ శంకర్‌రావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో ఈ విద్యా సంవత్సరం టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకుగాను అపరాధ రుసుంతో డిసెంబరు 11 వరకు గడువు పొడిగిస్తున్నట్లు డిసెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలులైన ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు పొందేందుకు ఎలాంటి ప్రాథమిక విద్యార్హతలు అవసరంలేదు. విద్యార్థులు  కనీసం 14 సంవత్సరాలు నిండినవారై ఉండాలి.  స్వీయ ధ్రువీకరణ ఆధారంగా పదోతరగతి(సెకండరీ కోర్సు)లో ప్రవేశం పొందేందుకు అర్హులు. అదేవిధంగా సెకండరీ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ (సీనియర్‌ సెకండరీ కోర్సు)లో ప్రవేశాలకు పొందేందుకు అర్హులు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రాంతీయ ఎన్‌ఐఓఎస్‌ కేంద్రంలో సంప్రదించవచ్చు.

ప్రవేశాలు పొందాలనుకునే వారు ఏ తరగతిదైనా ఒరిజినల్ టిసీ, పుట్టిన తేది పత్రాలు రెండు జిరాక్స్ జతలతో పాటు కులదృవీకరణ, ఆధార్ కార్డు రెండు జతల జిరాక్స్‌లు, రెండు ఫోటోలు తీసుకుని సంబంధిత ప్రాంతీయ ఎన్‌ఐఓఎస్ కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ లో చేరే వారు ఎస్‌ఎస్‌స్సీ మెమో, కుల దృవీకరణ, ఆధార్ రెండు జతల జిరాక్స్‌ల తోపాటు రెండు ఫోటోలు ఇవ్వాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Website 

ALSO READ:

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు 'వీశాట్-2024' నోటిఫికేషన్‌ విడుదల
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget