అన్వేషించండి

Inter Supplementary Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSBIE: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.  మే 2తో గడువు ముగియాల్సి ఉండగా.. మే 4 వరకు పొడిగించింది. నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.

TS Inter Supplemetary Exam Fee: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.  మే 2తో గడువు ముగియాల్సి ఉండగా.. మే 4 వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులకు కళాశాలలో ఫీజు చెల్లించేందుకు మే 4 వరకు, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు మే 5 వరకు గడువు విధించారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు. 

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. 

విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ఇంటర్ ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టిక‌ల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి పరీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పరీక్షలు జరుగనున్నాయి. 

ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-1.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1ఎ, బోట‌ని పేప‌ర్-1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-1.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1బి, జువాల‌జీ పేప‌ర్-1, హిస్టరీ పేప‌ర్-1.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-1, ఎకాన‌మిక్స్ పేప‌ర్-1.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-1, కామ‌ర్స్ పేప‌ర్-1.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, జియోగ్రఫీ పేప‌ర్-1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..

➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-2.

➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-2.

➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2ఎ, బోట‌ని పేప‌ర్-2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-2.

➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2బి, జువాల‌జీ పేప‌ర్-2, హిస్టరీ పేప‌ర్-2.

➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-2, ఎకాన‌మిక్స్ పేప‌ర్-2.

➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-2, కామ‌ర్స్ పేప‌ర్-2.

➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, జియోగ్రఫీ పేప‌ర్-2.

VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024

VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget