అన్వేషించండి

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ఇదే చివరి అవకాశం

Gurukulam Admissions: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు.

Telangana Gurukulam Admissions: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో (Gurukulam Admissions) 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్దేశించిన 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. జనవరి 20తో ముగియాల్సిన గడువును జనవరి 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ (TSWREIS) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్ల కోసం.. ఇప్పటి వరకు 1.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జనవరి 20తో ముగియాల్సిన గడువు మరో 3 రోజులు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి, గురుకుల సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకరం ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి డిసెంబరు 15న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు.

 పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు భారీ పోటీ ఉంటోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, దీంతోపాటు బోనఫైడ్‌/ స్టడీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

గురుకులాల్లో సీట్ల వివరాలు ఇలా..

సొసైటీ   బాలికల గురకులాలు బాలుర గురుకులాలు సీట్ల సంఖ్య 
ఎస్సీ గురుకులాలు 141  91 18,560
 ఎస్టీ గురుకులాలు 46 36 6,560
బీసీ గురుకులాలు 146 148 23,680
సాధారణ సొసైటీ     20 15 3,124
మొత్తం     353  290  51,924

ప్రవేశ వివరాలు...

* గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

అర్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతుండాలి. అయితే జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికైతే మాత్రం సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో తప్పనిసరిగా చదువుతూ ఉండాలి.

వయోపరిమితి: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా.

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

ప్రవేశపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్‌ షీట్‌‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, గణితం-25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ-10 మార్కులు, పరిసరాల విజ్ఞానం-20 మార్కులు ఉంటాయి. నాలుగో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.01.2024.

➥ ప్రవేశ పరీక్ష తేది: 11.02.2024.

➥ పరీక్ష సమయం: ఉ.11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు.

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Anakapally News: రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!
రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!
Embed widget